విరాట్‌ కోహ్లీకి(Virat kohli) పాకిస్తాన్‌లో(Pakistan) కోట్లాది మంది అభిమానులున్నారు.

విరాట్‌ కోహ్లీకి(Virat kohli) పాకిస్తాన్‌లో(Pakistan) కోట్లాది మంది అభిమానులున్నారు. కోహ్లీ ఆటను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు కూడా అక్కడ ఎక్కువే! అందుకే చాలా మంది విరాట్‌ రాక కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీ పాల్గొంటే బాగుండనేది వారి కోరిక. ఈ అభిలాష పాకిస్తాన్‌ మాజీ, ప్రస్తుత క్రికెటర్లకు కూడా ఉంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో కోహ్లీ పాల్గొనాలని మాజీ క్రికెటర్‌ యూనిస్‌ ఖాన్‌(younis khan) కూడా రిక్వెస్ట్‌ చేశాడు. పాక్‌ అభిమానులంతా విరాట్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, పాక్‌కు వచ్చి సెంచరీలు చేయడం ఒక్కటే విరాట్‌ కెరీర్‌లో లోటుగా ఉంటుందని యూనిస్‌ అభిప్రాయపడ్డాడు. యూనిస్‌ ఖాన్‌ లాగే చాలా మంది మాజీ క్రికెటర్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. బీసీసీఐ మాత్రం కుదరదంటే కుదరదని చెప్పేసింది. భారత ప్రభుత్వానికి కూడా టీమిండియా పాక్‌లో పర్యటించడం ఇష్టం లేదని తెలిసింది. ఒకవేళ భారత్‌ ఈ టోర్నీలో పాల్గొనాలనుకుంటే తటస్థ వేదికపై తమ మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీని బీసీసీఐ కోరింది. అయితే పీసీబీ మాత్రం ఈ ప్రతిపాదనకు నో చెబుతోంది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఐసీసీ సమావేశంలో కూడా పాక్‌ ఈ అంశాన్ని ప్రస్తావించలేదని తెలుస్తుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పాల్గొనే అంశాన్ని పాకిస్తాన్‌ ఐసీసీకి వదిలిపెట్టిందట! టోర్నమెంట్‌కు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు రెండు దేశాల మనసు మారవచ్చని ఆశపడుతున్నారు క్రికెట్‌ లవర్స్‌. క్రికెట్‌ను అభిమానించే నిజమైన భారతీయులు మాత్రం టీమిండియా పాక్‌లో పర్యటించాలని కోరుకుంటున్నారు. ముంబాయి దాడుల సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు అంతగా లేవు. కానీ క్రికెటర్ల మధ్య మాత్రం స్నేహబంధం ఉంది. ఇటీవలికాలంలో భారత్‌, పాక్‌ తలపడినప్పుడు ఆ విషయం స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్‌ ప్లేయర్లలో కొందరు విరాట్‌, రోహిత్‌ శర్మలతో కలిసి మెలిసి తిరిగారు. బాబర్‌ ఆజం, రిజ్వాన్‌ లాంటి పాక్‌ స్టార్లు పలు సందర్భాల్లో విరాట్‌, రోహిత్‌లను పొగుడుతూ వ్యాఖ్యలు చేశారు. భారత్‌, పాక్‌ ఆటగాళ్ల మధ్య సహృదయ వాతావరణం ఉన్నా క్రికెట్‌ పర్యటనలు మాత్రం సాగడం లేదు. అదే విచిత్రం!

Eha Tv

Eha Tv

Next Story