పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) కష్టాలు పెరిగాయి. తోషాఖానా(Toshakhana) కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు(District Sessions Court) దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు మూడేళ్ల శిక్ష పడింది.

పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran khan) కష్టాలు పెరిగాయి. తోషాఖానా(Toshakhana) కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను జిల్లా సెషన్స్ కోర్టు(District Sessions Court) దోషిగా నిర్ధారించింది. ఈ కేసులో ఆయ‌న‌కు మూడేళ్ల శిక్ష పడింది. శిక్షను ప్రకటించిన తర్వాత.. ఇస్లామాబాద్(Islamabad) పోలీసులు లాహోర్‌లో(Lahore) ఇమ్రాన్‌ను అరెస్టు చేశారు.

పాకిస్తాన్ చట్టం ప్రకారం.. విదేశాల నుంచి, ప్రముఖుల నుండి స్వీకరించబడిన ఏ బహుమతైనా స్టేట్ డిపాజిటరీ అంటే తోషాఖానాలో ఉంచాలి. దేశాధినేత బహుమతిని తన వద్ద ఉంచుకోవాలనుకుంటే.. ఆయ‌న‌ దాని విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లించాలి. ఇది వేలం ప్రక్రియ ద్వారా నిర్ణయించబడుతుంది. దీని ద్వారా వ‌చ్చిన‌ డబ్బు జాతీయ ఖజానాలో జమ చేయబడుతుంది.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ డిపాజిటరీ, తోషాఖానా నుండి తగ్గింపు ధరకు పొందిన ఖరీదైన గ్రాఫ్ రిస్ట్ వాచ్‌తో సహా బహుమతులను కొనుగోలు చేసి.. వాటిని లాభాలకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇమ్రాన్ ఖాన్ తన అధికారిక పర్యటనల సందర్భంగా దాదాపు రూ.14 కోట్ల విలువైన 58 బహుమతులు అందుకున్నారు. ఈ ఖరీదైన బహుమతులు తోషఖానాలో జమ చేయబడ్డాయి. తరువాత ఇమ్రాన్ ఖాన్ వాటిని తోషాఖానా నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. ఆపై వాటిని మార్కెట్లో ఎక్కువ‌ ధరకు విక్రయించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ మొత్తం ప్రక్రియ కోసం ఆయన ప్రభుత్వ చట్టంలో మార్పులు కూడా చేశారు.

మీడియా కథనాల ప్రకారం.. ఇమ్రాన్ ఈ బహుమతులను తోషాఖానా నుండి 2.15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు. వాటిని విక్రయించడం ద్వారా 5.8 కోట్ల రూపాయల లాభం పొందాడు. ఈ బహుమతులలో గ్రాఫ్ వాచ్, ఒక జత కఫ్‌లింక్‌లు, ఖరీదైన పెన్, ఒక ఉంగరం, నాలుగు రోలెక్స్ వాచీలు ఉన్నాయి. విక్రయానికి సంబంధించిన వివరాలను పంచుకోనందుకు గత ఏడాది అక్టోబర్‌లో పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ECP) అతనిని అనర్హుడిగా ప్రకటించింది.

Updated On 5 Aug 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story