Pakistan Crisis : పాకిస్తాన్లో సంక్షోభం.. భారీగా పెరిగిపోయిన ధరలు.!
పసిడి ధర. 2లక్షలు లీటర్ పాలు రూ.200 పైగా కేజీ చికెన్ రూ. 800 పాకిస్తాన్ ఈ పేరు వినగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ తీవ్రవాదం. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఉగ్రవాదుల దాడి, బాంబుల మోతలు, కాల్పుల కలకలం, పదుల సంఖ్యలో అమాయక ప్రజల మరణాలు. చాలా ప్రాంతాలలో నిత్యం ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తుంటారు. గత కొన్ని […]
పసిడి ధర. 2లక్షలు
లీటర్ పాలు రూ.200 పైగా
కేజీ చికెన్ రూ. 800
పాకిస్తాన్ ఈ పేరు వినగానే మొదట అందరికీ గుర్తుకు వచ్చేది అక్కడ తీవ్రవాదం. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఉగ్రవాదుల దాడి, బాంబుల మోతలు, కాల్పుల కలకలం, పదుల సంఖ్యలో అమాయక ప్రజల మరణాలు. చాలా ప్రాంతాలలో నిత్యం ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనని ఆందోళన. మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తుంటారు. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్లో ఇదే పరిస్థితి.
అలాంటి దేశంలో ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
సంక్షోభం...సమస్యలు
ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనేక ప్రచార మాధ్యమాల ద్వారా తెలుస్తుంది. దీంతో అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు, వడ్డీ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఆసుపత్రులలో మందుల కొరతతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కారణం దేశంలో ఎగుమతి దిగుమతులకు ఆటంకాలు ఏర్పడడంతో రోజువారీగా ఉపయోగించే వస్తువులు అందుబాటులో లేకుండా పోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి.వలస కూలీల పరిస్థితి దుర్భరంగా మారింది. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా మారిందని తెలుస్తోంది.
బగ్గుమంటున్న ధరలు..
పాకిస్థాన్ దేశంలోని చాలా ప్రాంతాలలో లీటర్ పాల ధర 200 రూపాయలు.1 కేజీ చికెన్ 800. వీటికి తోడు ఒక లీటర్ పెట్రోల్, డీజిల్ 300 రూపాయలకు అమ్ముతున్నారని సమాచారం. ముఖ్యంగా పాకిస్తాన్ లో పసిడి ధరలు హాట్ టాపిక్ గా మారాయి.10 గ్రాముల పసిడి ధర 2 లక్షల రూపాయలు, 12 గ్రాముల ధర 2.06 లక్షలకు పైగా పలుకుతుంది. అంటే ఆ దేశంలో ఎలాంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయో తెలుస్తుంది. మిగతావస్తువుల ధరలు ఏ స్థాయిలో బగ్గుమంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితిలే పాకిస్తాన్ లో కొనసాగితే ప్రజలు భయానక పరిస్థితులు చూడాల్సి వస్తుందని అనేకమంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే వీటన్నిటికి పాకిస్తాన్ అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలు, నియంతృత్వ పోకడలు, మత విద్వేషాలు. అనాలోచిత నిర్ణయాలు కారణాలుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ దేశ ఆర్థిక సంక్షోభానికి పాకిస్తాన్ స్వయంకృపరాధమే కారణమని చాలా దేశాలు అభిప్రాయపడుతున్నాయి.