Pakisthan Attack On Iran : ఇరాన్‌పై ప్రతీకారదాడులకు పాల్పడిన పాకిస్తాన్
పాకిస్తాన్‌లో(Pakisthan) ఉన్న బలూచిస్తాన్‌లో(Baluchisthan) ఇరాన్ చేసిన దాడుల పట్ల పాకిస్తాన్ సీరియస్‌గా ఉంది. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన పాకిస్తాన్ 24 గంటల్లోనే ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఇరాన్ భూభాగంలోని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ గురువారం వైమానిక దాడులు(Air strikes) చేసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.
పాకిస్తాన్‌లో(Pakisthan) ఉన్న బలూచిస్తాన్‌లో(Baluchisthan) ఇరాన్ చేసిన దాడుల పట్ల పాకిస్తాన్ సీరియస్‌గా ఉంది. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన పాకిస్తాన్ 24 గంటల్లోనే ఆ దిశగా చర్యలు తీసుకుంది. ఇరాన్ భూభాగంలోని బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ గురువారం వైమానిక దాడులు(Air strikes) చేసినట్టు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. బలూచిస్థాన్‌లోని జైష్ అల్ అదిల్ మిలిటెంటు గ్రూపునకు చెందిన రెండు స్థావరాలపై ఇరాన్ దాడి చేసిన ఒక రోజు వ్యవధిలోనే పాకిస్తాన్ ప్రతిస్పందించడం గమనార్హం. ఇరాన్ చేసిన దాడి తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉల్లంఘన చర్యగా పాకిస్తాన్ అభివర్ణించింది. ఇరాన్ విదేశాంగశాఖలోని సీనియర్ అధికారుల దగ్గర దీనిపై నిరసన తెలియజేసింది. మిలిటెంట్ల అక్రమ కార్యకలాపాలపై తమతో స్పందించడానికి అనేక మార్గాలుంటాయని, దాడులు చేయడం సరికాదని గట్టిగా చెప్పింది. ఇరాన్ నుంచి తమ రాయబారిని వెనక్కి వచ్చేయాలని ఆదేశించింది. దీంతోపాటు భవిష్యత్తులో జరగబోయే అన్ని ద్వైపాక్షిక పర్యటనలను ఉపసంహరించుకుంది.