పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కు బ్యాడ్‌ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి.

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్‌కు బ్యాడ్‌ టైం స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఈ ఆర్థిక సంవత్సరం పాకిస్తాన్‌లో దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటారని ప్రపంచ బ్యాంకు హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు(World Bank) పాకిస్తాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7 శాతానికి తగ్గించింది. దీని వెనుక ప్రధాన కారణం ఆ దేశం అనుసరిస్తున్న కఠినమైన ఆర్థిక విధానాలే, ఇవి వృద్ధిని మందగింపజేస్తున్నాయి. షాబాజ్ షరీఫ్(Shahbaz Sharif) నేతృత్వంలోని ప్రభుత్వం దాని బడ్జెట్ లోటు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చు. పాకిస్తాన్(Pakistan)అప్పు కూడా దాని GDPతో పోలిస్తే పెరుగుతుందని భావిస్తున్నారు. వ్యవసాయంపై దీని ప్రభావం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న వాతావరణం పరిస్థితుల కారణంగా, వరి మొక్కజొన్న వంటి ముఖ్యమైన పంటల ఉత్పత్తి బాగా తగ్గవచ్చని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. ఆహార ఉత్పత్తిలో ఈ తగ్గుదల 2024-25 ఆర్థిక సంవత్సరంలో 10 మిలియన్ల మంది పాకిస్తానీలను, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారిని అధిక స్థాయి ఆహార అభద్రతను ఎదుర్కోనున్నారు. పేదరికం, ఆహార అభద్రత, నిరుద్యోగం వంటివి పెరుగుతాయని అంచనా వేశారు. వ్యవసాయం, తయారీ, తక్కువ-విలువ సేవలు వంటి పేదలకు ఉద్యోగాలు కల్పించే రంగాలు వృద్ధి చెందడం లేదు లేదా తగ్గిపోతున్నాయని ప్రపంచ బ్యాంక్‌ చెబుతోంది. ఫలితంగా, వేతనాలు పెరగడం లేదు, ప్రజలు జీవితాలకు ఇబ్బందులు వస్తాయి. మరో భయంకరమైన వార్త ఏంటంటే ఈ సంవత్సరం సుమారు 1.9 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలోకి పడిపోయే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు చెబుతోంది. పాకిస్తాన్ జనాభా దాదాపు 2 శాతం పెరుగుతుండడంతో, పేదరికం రేటు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. జనాభాకు ఉపాధి నిష్పత్తి కేవలం 49.7 శాతం మాత్రమే ఉండడం విశేషం.

ehatv

ehatv

Next Story