హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం ఆప‌లేదు.

హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లా మరణం తర్వాత కూడా లెబనాన్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం ఆప‌లేదు. ఆదివారం కూడా ఇజ్రాయెల్ లెబనాన్(Israeli Lebanon) అంతటా భారీ బాంబుల‌తో విరుచుకుప‌డింది. ఇందులో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. వైమానిక దాడుల్లో 359 మంది గాయపడ్డారు. అత్యధిక మరణాలు(48) ఐన్ అల్-డెల్బ్(Ain al-Delb), టైర్(Tair) ప్రాంతాల్లో సంభవించాయి.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖానా హాస్పిటల్(Khana Hospital) భారీగా దెబ్బతిన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బెకా వ్యాలీ(Bekaa Valley)లోని బాల్‌బెక్-హెర్మెల్‌(Baalbeck-Hermel)లో 33 మంది మరణించగా.. 97 మంది గాయపడ్డారు. లెబనాన్‌లోని కోలా ప్రాంతంలో ఇజ్రాయెల్ తొలిసారిగా భారీ బాంబు దాడి చేసింది. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నిరంతరం దేశవ్యాప్తంగా వైమానిక దాడులు చేస్తున్నాయి.

బీరుట్‌(Beerut)లోని కోలా(Kola) జిల్లాలో జరిగిన వైమానిక దాడిలో పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన ముగ్గురు నాయకులు కూడా మరణించారు. ఇది కాకుండా ఇజ్రాయెల్ సైన్యం బెకా లోయలోని డజన్ల కొద్దీ హిజ్బుల్లా స్థావ‌రాల‌పై దాడి చేసింది. హిజ్బుల్లా ఆయుధ డిపోలను లక్ష్యంగా చేసుకుంటూనే ఉంటామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. లెబనీస్ ప్రభుత్వం ప్రకారం.. ఇజ్రాయెల్ వైమానిక దాడులలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా మరణించగా.. 6,000 మంది గాయపడ్డారు.

ehatv

ehatv

Next Story