Kim JonG Un : కదనానికి సిద్ధమవుతున్న కిమ్ జాంగ్ ఉన్
ఉత్తర కొరియా(North korea) అధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim jong Un) కదనానికి కాలుదువ్వబోతున్నారా? అంటే చూడబోతే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఓ పక్క దక్షిణ కొరియా(South Korea)-అమెరికా(America) సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగుస్తున్న సమయంలో మరో పక్క ఉత్తర కొరియాలో కిమ్ నాయకత్వంలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది.
ఉత్తర కొరియా(North korea) అధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim jong Un) కదనానికి కాలుదువ్వబోతున్నారా? అంటే చూడబోతే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. ఓ పక్క దక్షిణ కొరియా(South Korea)-అమెరికా(America) సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక ఉమ్మడి సైనిక విన్యాసం ముగుస్తున్న సమయంలో మరో పక్క ఉత్తర కొరియాలో కిమ్ నాయకత్వంలో నూతన సైనిక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను హెచ్చరికకగా భావించాలేమో! ఉత్తుత్తి విన్యాసాల్లా కాకుండా నిజమైన యుద్ధంలా కసరత్తు చేయాలని కమాండర్లతో కిమ్ జాంగ్ చెప్పారు. ఈ ప్రదర్శనలో ఒక నూతన యుద్ధ ట్యాంక్(War tank) మొదటిసారి విజయవంతంగా మందుగుండు సామగ్రిని ప్రయోగించింది. యుద్ధ పరిస్థితులలో సమర్థవంతంగా పనిచేసే ఈ భారీ యుద్ధ ట్యాంకులు ఒకేసారి లక్ష్యాలపై దాడి చేసి, చిధ్రం చేస్తాయి. నూతన సైనిక ప్రదర్శనలో కిమ్‌తో పాటు రక్షణ మంత్రి కాంగ్ సున్‌నామ్, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు. సైనిక విన్యాసాల సందర్భంగా ఉత్తర కొరియా మీడియా పలు ఫోటోలను విడుదల చేసింది. ఉత్తర కొరియా జెండా కలిగిన యుద్ధ ట్యాంకులు ఫొటోలలో కనిపిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో ప్యోంగ్యాంగ్ ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో 2018 అంతర్-కొరియా సైనిక ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ఫ్రీడమ్ షీల్డ్ ఎక్స్‌ర్‌సైజ్ పేరిట సైనిక విన్యాసాలు జరిగాయి.