పాలకులు ప్రజల మేలు కోసం పాటుపడాలి. ప్రజల కడుపు నిండిన తర్వాతే తను ఆకలి తీర్చుకోవాలి. అంతేకానీ ప్రజలను గాలికి వదిలేసి ఖరీదైన ఆహారం తినేవాడు పాలకుడనిపించుకోడు! ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) ఈ కోవకు వస్తాడు. ఆ దేశం ఇప్పుడు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఆహార కొరత దేశ ప్రజల కడుపులు మాడ్చేస్తున్నది.

పాలకులు ప్రజల మేలు కోసం పాటుపడాలి. ప్రజల కడుపు నిండిన తర్వాతే తను ఆకలి తీర్చుకోవాలి. అంతేకానీ ప్రజలను గాలికి వదిలేసి ఖరీదైన ఆహారం తినేవాడు పాలకుడనిపించుకోడు! ఉత్తర కొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un) ఈ కోవకు వస్తాడు. ఆ దేశం ఇప్పుడు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఆహార కొరత దేశ ప్రజల కడుపులు మాడ్చేస్తున్నది. కిమ్‌ మాత్రం విలాసవంతమైన జీవితాన్నే గడుపుతున్నాడు. విందులు వినోదాల కోసం కోట్లకు కోట్లు వెచ్చిస్తున్నాడు. దేశం ఎటుపోతే తనకేమిటన్నట్టు విదేశాల నుంచి ఖరీదైన మద్యం, సిగరెట్లు, మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్నాడు.

కిమ్‌ ఖరీదైన మద్యాన్ని(Costly Wine) తప్ప మామూలు మందు అసలు ముట్టరు. అయిదు లక్షల రూపాయలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ(Hennessy) అనే మద్యాన్ని తప్ప మరోటి పుచ్చుకోడని అమెరికా రక్షణ రంగ నిపుణుడు ఒకరు అంటున్నారు. ఖరీదైన మద్యం బ్రాండ్ల దిగుమతికే కిమ్‌ ప్రతి ఏడాది 30 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెడతారట. మన కరెన్సీలో చెప్పాలంటే 247 కోట్ల రూపాయలన్నమాట! మద్యమే కాదు, కిమ్‌ తినే తిండి కూడా ఖరీదైనదిగా ఉండాలి. చాలా అరుదుగా దొరికే ప్రత్యేక ఆహారాన్ని మాత్రమే కిమ్‌ తీసుకుంటారు.

ఇటలీలోని పర్మా ప్రాంతంలో లభించే పర్మా హామ్‌ (పంది మాంసంతో తయరు చేస్తారు), స్విస్‌ చీజ్‌ను ప్రత్యేకంగా తెప్పించుకుంటాడు కిమ్‌. సిగరెట్లు కూడా అలాగే ఉంటాయి. కిమ్‌ వాడే సిగరెట్లు ప్రత్యేకమైన బంగారపు రేకుతో చుట్టి ఉంటాయని చెబుతున్నారు! 1997లో కిమ్‌ కేవలం పిజ్జాలు చేయడానికి ఇటలీ నుంచి బోల్డంత డబ్బు ఇచ్చి చెఫ్‌ను రప్పించుకున్నాడు. బ్రెజిలియన్‌ కాఫీ కోసం ఏటా 9.6 డాలర్లను వెచ్చిస్తున్నాడు. అంటే ఏడు కోట్ల 96 లక్షల రూపాయలన్న మాట! కిమ్‌,

అతని తండ్రి కలిసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గొడ్డు మాంసం కోబ్‌ స్టీక్స్‌, క్రిస్టల్‌ షాంపైన్‌తో భోజనం చేసేవారట! కిమ్‌ దగ్గర చెఫ్‌గా పని చేసిన వారొకరు ఈ విషయం తెలిపారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం ఖరీదైన స్నేక్‌ వైన్‌ పుచ్చుకునేవాడట! అమెరికా నుంచి మార్ల్‌బోరో సిగరెట్‌లతో సహా నిద్రలేమి చికిత్సకు ఉపయోగించే జోల్‌పిడెమ్‌ వంటి మందులను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. అసలే ప్రపంచదేశాల ఆంక్షలతో నార్త్‌ కొరియా అనేక ఇబ్బందులు పడుతోంది. దీనికి తోడు అక్కడ తీవ్రమైన క్షామం నెలకొంది. పంటల సాగు తగ్గిపోయింది. రెండున్నర కోట్ల పైచిలుకు ప్రజలనున్న ఉత్తరకొరియాలో జనాలకు సరిపడా ఆహారపదార్థాలు లభించడం లేదు.

Updated On 11 July 2023 7:11 AM GMT
Ehatv

Ehatv

Next Story