No Jeans in North Korea : జీన్స్ వేసుకున్నారా? కటకటాలు లెక్కించాల్సిందే...ఎక్కడంటే!
ఉత్తర కొరియా(North korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim jong Un) గురించి మీడియాలో కథలు కథలుగా విన్నాం
ఉత్తర కొరియా(North korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim jong Un) గురించి మీడియాలో కథలు కథలుగా విన్నాం. అతడిది నియంతృత్వ పాలన అని కూడా చదివాం! ప్రతి విషయంపై ఆంక్షలు విధిస్తూ నిరంకుశత్వ ధోరణితో పాలన చేస్తాడట! చివరికి ప్రజలు ధరించే దుస్తులపై కూడా ఆంక్షలు ఉంటాయట! అందరూ ధరించే జీన్స్‌ను(Jeans) ఉత్తర కొరియా బ్యాన్(Ban) చేసిందనే వార్త మీడియాలో వచ్చింది. ప్రపంచమంతటా యూత్ ఎంతో ఇష్టంగా వేసుకునే జీన్స్‌ను బ్యాన్ చేయడమేమిటి? పైగా దాన్ని ధరించడమంటే నేరం చేసినట్టుగా ట్రీట్ చేయడమేమిటి?
అసలు ఉత్తర కొరియా జీన్స్‌ను ఎందుకు బ్యాన్ చేసింది? అంటే దాని వెనుక ఓ కథ ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొరియా రెండు దేశాలుగా విడిపోయింది. దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలుగా అవతరించింది. ఈ ఏకధ్రువ ప్రపంచంలోని దేశాలు ఉంటే అమెరికా వైపైనా ఉండాలి. లేదా అమెరికా వ్యతిరేక శిబిరంలోనైనా ఉండాలి. దక్షిణ కొరియా అమెరికాకు మిత్ర దేశంగా ఉంటే , ఉత్తరకొరియా మాత్రం అమెరికా అంటేనే మండిపోతుంటుంది. ఆ దేశానికి సాన్నిహిత్యంగా ఉన్న ప్రతిదీ ఉత్తర కొరియాకు వ్యతిరేకం. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తన దేశంపై పడటాన్ని అస్సలు ఇష్టపడదు ఉత్తర కొరియా. జీన్స్ అమెరికాకు చెందిన ఫ్యాషన్ ట్రెండ్ అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఉత్తర కొరియాకు మాత్రం ఇది ప్యాంటు కాదు. స్వేచ్ఛ, తిరుగుబాటుకు చిహ్నంగా భావిస్తుంటుంది. అందుకే జీన్స్‌ను నిషేధించింది. ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనూ ఎక్కడ కూడా ప్రజలు జీన్స్ ధరించకూడదు. తమ దేశ సంప్రదాయానికి అనుగుణంగానే ఉండాలి. ఇది పాలనకు అత్యంత ముఖ్యమని ఉత్తర కొరియా విశ్వసించడం విశేషం.