మౌరిటానియ (Mauritania)ఉత్తర ఆఫ్రికాలో(North africa) ఒక దేశం. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ కంటే ఎన్నోరెట్లు విశాలమైనది. ఈ దేశ రాజధాని, పెద్ద పట్టణం నౌక్చోటు అట్లాంటిక్(Atlantic) తీరంలో ఉంది. మౌరిటానియా, సహారా ఇసుకలో ఉన్న దేశం.

మౌరిటానియ (Mauritania)ఉత్తర ఆఫ్రికాలో(North africa) ఒక దేశం. ప్రస్తుతం ఈ దేశం పాత రోమన్ కంటే ఎన్నోరెట్లు విశాలమైనది. ఈ దేశ రాజధాని, పెద్ద పట్టణం నౌక్చోటు అట్లాంటిక్(Atlantic) తీరంలో ఉంది. మౌరిటానియా, సహారా ఇసుకలో ఉన్న దేశం. ఈ ఆఫ్రికన్ దేశంలో విడాకులు(Divorce) చాలా సర్వసాధారణమట. అంతేకాదు విడాకులను ఒక పండగలా చేసుకుంటారు. ఈ దేశంలో విడాకుల వల్ల మహిళలకు స్వయంప్రతిపత్తి, స్వాతంత్ర్యం లభిస్తుందని అంటున్నారు.
విడాకులు తీసుకున్న స్త్రీలు తమ సామాజిక స్థితిని తిరిగి స్థాపించుకోవడానికి, పునర్వివాహానికి అవకాశం కల్పిస్తారు.

అంతేకాకుండా విడాకులు తీసుకున్న సమయంలో బంధువులు, స్నేహితులను పిలిచి డ్యాన్స్‌లు వేస్తూ సరదాగా సెలెబ్రేట్‌ చేసుకుంటారు. విడాకులు తీసుకున్న మహిళ మరో పెళ్లికి సిద్ధంగా ఉంది అని సంకేతాలు ఇచ్చేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారట. ఇక్కడ మహిళలు తమ జీవితమంతా అనేకసార్లు వివాహం చేసుకోవచ్చు. మునుపటి వివాహాల నుంచి వచ్చిన అనుభవం ఉన్న స్త్రీని(Women) పెళ్లి చేసుకునేందుకే ఎక్కువ ఇష్టపడతారని చెప్తున్నారు. అనుభవం లేని వధువు కంటే విడాకులు తీసుకున్న మహిళలనే ఎంపిక చేసుకుంటారు. మహిళలు తమ అవసరాలను తీర్చడం లేదని భావిస్తే విడాకులు తీసుకోవడానికి వారికి అధికారం వస్తుంది. కానీ ఇక్కడ మహిళలు విడాకులు తీసుకుంటే భర్తకే పరిహారం చెల్లించాలని ఈ దేశంలో 'ఖుల్‌' అనే ఇస్లామిక్‌ చట్టం చెప్తుంది. అయితే విడాకుల రేటు ఎక్కువైతే పిల్లలు మరియు కుటుంబ స్థిరత్వంపై ప్రభావం చూపుతుందనే చర్చ కూడా లేవనెత్తారు. అంతేకాకుండా, మహిళలకు, ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్ర్యం లేనివారికి ఆర్థికపరమైన చిక్కులు వస్తాయని అక్కడి నిపుణులు విశ్లేషిస్తున్నారు. బయటి వ్యక్తులకు ఇది విచిత్రంగా అనిపించినప్పటికీ, చాలా మంది మౌరిటానియన్ మహిళలకు వివాహ జీవితం ముగియడంతో ఇక జీవితం ఆగదని, అది జస్ట్ ఒక కామా మాత్రమేనని, భవిష్యత్‌లో సరికొత్త అడుగులు వేసేందుకు ఈ విడాకులు ఉపయోగపడతాయని వారు భావిస్తారట.

Updated On 10 Jun 2024 7:32 PM GMT
Ehatv

Ehatv

Next Story