రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్ష పోటీదారు నిక్కీ హేలీ బుధవారం

రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్ష పోటీదారు నిక్కీ హేలీ తన మాజీ ప్రత్యర్థిపై ప్రచార బాటలో నెలల తరబడి తీవ్ర విమర్శలు చేసినప్పటికీ, నవంబర్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తానని చెప్పారు. నవంబర్ 5న జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ట్రంప్, డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బిడెన్ మధ్య జరిగే రీమ్యాచ్‌లో హేలీ ఎవరికి మద్దతు తెలుపుతారా అని అమెరికన్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మార్చిలో హేలీ రిపబ్లికన్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం తన బిడ్‌ను విరమించుకున్నప్పటికీ, ఆమె పేరు బ్యాలెట్‌లో అలాగే ఉంది.

విధానాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపూర్ణంగా కనిపించడంలేదని, ఇదే విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానని హేలీ అన్నారు. ట్రంప్ విధానాలు సంపూర్ణంగా లేకపోయినప్పటికీ ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఒక విపత్తు అని, అందుకే తాను ట్రంప్‌కే ఓటు వేస్తానని హేలీ స్పష్టం చేశారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థి రేసులో ట్రంప్‌కు గట్టి పోటీ ఇచ్చిన నిక్కీ హేలీ కొన్ని నెలల పాటు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మాత్రం ట్రంప్ కు తన మద్దతు అంటూ చెప్పుకొచ్చింది.

Updated On 22 May 2024 11:27 PM GMT
Yagnik

Yagnik

Next Story