Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురుదెబ్బ! లైంగిక వేధింపుల కేసులో భారీ జరిమానా!
ప్రముఖ రచయిత్రిని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) లైంగికంగా వేధించినట్టు న్యూయార్క్ జ్యూరీ నిర్ధారణకు వచ్చింది. ఆమెకు పరిహారంగా అయిదు మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే 410 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది.
ప్రముఖ రచయిత్రిని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) లైంగికంగా వేధించినట్టు న్యూయార్క్ జ్యూరీ నిర్ధారణకు వచ్చింది. ఆమెకు పరిహారంగా అయిదు మిలియన్ డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే 410 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రంప్‌ను ఆదేశించింది. పాపం 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్న ట్రంప్‌కు ఇది ఊహించని ఎదురుదెబ్బే! ప్రముఖ రచయిత్రి ఇ.జీన్ కారెల్ తనపై ట్రంప్ లైంగిక దాడికి దిగాడని ఆరోపించారు. 1996లో మాన్‌హటన్ అవెన్యూలోని లగ్జరీ బర్జ్‌డార్ఫ్ గుడ్‌మ్యాన్ స్టోర్‌లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఆ తర్వాత కూడా తనను లైంగికంగా వేధించారని ఆరోపించారు.
2019లో కూడా ఒకానొక సందర్భంలో తన గురించి అసభ్యంగా మాట్లాడారని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని పరువునష్టం పిటిషన్ దాఖలు చేశారు జీన్ కారెల్. ట్రంప్ తనను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతోనే తాను 20 ఏళ్లకుపైగా ఈ విషయంపై బహిరంగంగా చెప్పలేకపోయానని అన్నారు. జీన్ కారెల్ చేసిన ఆరోపణలపై న్యూయార్క్ జ్యూరీ విచారణ జరిపింది. ట్రంప్‌ను దోషిగా తేల్చింది. కాకపోతే ట్రంప్‌పై జీన్ కారెల్ చేసిన అత్యాచారం ఆరోపణ మాత్రం అబద్ధమని, మిగతా ఆరోపణలన్నీ నిజమేనని చెప్పింది. ఆమెకు నష్టపరిహారంగా ట్రంప్ 410 కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. ట్రంప్ మాత్రం ఎప్పటిలాగే తీర్పుపై విమర్శలు చేశారు. తనకు ఇది అవమానించేట్టుగా ఉందన్నారు. తనను ఓ మంత్రగత్తె వెంటాడుతోందంటూ రచయిత్రిపై మండిపడ్డారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదన్నారు.