న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో(New Zealand Parliament) ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది.

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో(New Zealand Parliament) ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లుకు వినూత్న నిరసన ఎదురైంది. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి(MP Hana rahithi) 'హక' వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పేపర్లను(Bill paper) చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే న్యూజిలాండ్‌లో అత్యంత చిన్న వయసు ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎన్నికైన తర్వాత తమ మావోరి కమ్యూనిటీ ఉన్న వివక్షను ప్రస్తావిస్తూ పార్లమెంట్‌లో శివతాండవం చేసింది. తమ జాతి కోసం ఆమె పార్లమెంట్‌ ప్రసంగం సంచలనంగా మారింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు. పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును చించేస్తూ ఆగ్రహంతో షేక్‌ చేశారు. దీనికి తన సహచర ఎంపీలు కూడా మద్దతు పలికారు. గ్యాలరీలో ఉన్నవారు కూడా తనతో గళం కలిపారు. పార్లమెంట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.



Updated On 15 Nov 2024 10:23 AM GMT
Eha Tv

Eha Tv

Next Story