Kiri Allen Drunked Minister : తప్పతాగి కారు నడిపిన మహిళా మంత్రి... తర్వాత ఏం జరిగింది?
ఆమె ఓ దేశానికి మంత్రి(Minister), నిర్వర్తిస్తున్నది న్యాయశాఖ. అలాంటప్పుడు విధి నిర్వహణలో ఆమె ఎంత నిక్కచ్చిగా, ఎంత నైతికంగా ఉండాలి? కానీ ఆమె అలా లేరు. ఫుల్లుగా మద్యం(Alcohol) తాగారు. తాగి కారును వేగంగా తోలారు. తోలి పార్కింగ్‌లోని వాహనాలను ఢీ కొట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్టు తేలింది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయబోయారు.. మంత్రిగా తన దర్పాన్ని చూపించారు. అయినప్పటికీ పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు
ఆమె ఓ దేశానికి మంత్రి(Minister), నిర్వర్తిస్తున్నది న్యాయశాఖ. అలాంటప్పుడు విధి నిర్వహణలో ఆమె ఎంత నిక్కచ్చిగా, ఎంత నైతికంగా ఉండాలి? కానీ ఆమె అలా లేరు. ఫుల్లుగా మద్యం(Alcohol) తాగారు. తాగి కారును వేగంగా తోలారు. తోలి పార్కింగ్‌లోని వాహనాలను ఢీ కొట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెకు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో ఆమె మోతాదుకు మించి మద్యం తాగినట్టు తేలింది. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేయబోయారు.. మంత్రిగా తన దర్పాన్ని చూపించారు. అయినప్పటికీ పోలీసులు తమ డ్యూటీ తాము చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విషయం పది మందికి తెలియడంతో గత్యంతరం లేక పదవికి రాజీనామా చేశారు మంత్రిగారు! ఆగడాగండి.. ఇది జరిగింది మన దగ్గర కాదు.. న్యూజిలాండ్‌లో(New Zealand).. మన దగ్గర ఏం జరిగేదో చెప్పాల్సిన పని లేదనుకోండి.. సరే మళ్లీ న్యూజిలాండ్ దగ్గరకు వెళదాం.. ఆ మంత్రి పేరు కిరి అలెన్(Kiri Allen).. ప్రధానమంత్రి క్రిస్ హిప్కిన్స్(Chris Hipkins) సోమవారం ఉదయం అలెన్‌తో మాట్లాడారు. ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మంత్రిగా విధులు నిర్వహించేందుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె పనికిరారని అన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. అలెన్ రాజీనామా చేయడానికి అంగీకరించామని, పార్లమెంట్ సభ్యురాలిగా మాత్రం ఆమె కొనసాగుతారని క్రిస్ హిప్కిన్స్ తెలిపారు. 39 ఏళ్ల అలెన్ లేబర్ పార్టీలో చాలా వేగంగా ఎదిగారు. ఈమధ్యన ఆమె తన భర్త నుంచి విడిపోయారు. అప్పట్నంచి ఆమె మానసిక స్థితి బాగో లేదు. తన ఉద్యోగులతో కూడా ఆమె సరిగ్గా వ్యవహరించేవారు కాదట! హిప్కిన్స్ మంత్రివర్గంలో పదవి కోల్పోయిన నాఉగో మంత్రి అలెన్. అక్టోబర్ 14న న్యూజిలాండ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి సమయంలో మంత్రుల వివాదాలు ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్నాయి.