Diwali Is Public Holiday In New York : న్యూయార్క్లో దీపావళి పండుగకు స్కూళ్లకు సెలవు
భారతీయులు(Indians) ప్రపంచంలో ఏ మూలనున్నా తమ సంస్కృతి(Culture) సంప్రదాయాలను(Traditions) మర్చిపోరు.. పండుగ పబ్బాలను చుట్టుపక్కల ఉన్నవారితో కలిసి జరుపుకుంటారు. అన్నింటి కంటే పెద్దగా దీపావళిని(Diwali) జరుపుకుంటారు. ఈ వెలుగుల పండుగ మన దేశంలో ఎంత గొప్పగా జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జరుగుతుంది. ఈ పండుగను అమెరికాలో కూడా ఘనంగా నిర్వహిస్తారు.
భారతీయులు(Indians) ప్రపంచంలో ఏ మూలనున్నా తమ సంస్కృతి(Culture) సంప్రదాయాలను(Traditions) మర్చిపోరు.. పండుగ పబ్బాలను చుట్టుపక్కల ఉన్నవారితో కలిసి జరుపుకుంటారు. అన్నింటి కంటే పెద్దగా దీపావళిని(Diwali) జరుపుకుంటారు. ఈ వెలుగుల పండుగ మన దేశంలో ఎంత గొప్పగా జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో జరుగుతుంది. ఈ పండుగను అమెరికాలో కూడా ఘనంగా నిర్వహిస్తారు. లేటెస్ట్‌గా న్యూయార్క్ గవర్నమెంట్(New York Government) దీపావళిని సెలవు దినంగా(Public Holiday) ప్రకటించింది. దీపావళి పండుగను అమెరికాలో సెలవు దినంగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ ఆ దేశ కాంగ్రెస్‌లో ఓ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు దానిని న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ ఆమోదించింది. స్కూల్ సెలవుల క్యాలెండర్‌లోని బ్రూక్లీన్-క్వీన్స్(Brooklyn-Queens) ఏ స్థానంలో దీపావళిని చేర్చింది. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసుకోవడానికి వేలాది మంది న్యూయార్క్ వాసులు(New york Citizens) దీపావళిని జరుపుకుంటారు. ఈ మధ్యనే చట్టసభ్యులు దీపావళి యాక్ట్ డే బిల్లును రూపొందించారు. ఇప్పుడు దీనికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇది అందరి విజయమని, అందరికీ ముందే వచ్చిన శుభ్ దీపావళి అని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ట్విటర్‌లో పేర్కొన్నారు. బిల్లుపై గవర్నర్ కాథీ హెచుల్ సంతకం చేస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు.