నెదర్లాండ్స్‌(Netherlands)కు చెందిన ఓ డాక్టర్‌ పెద్ద చిక్కులో పడ్డాడు. అతగాడికి అంత పెద్ద సమస్య ఏమొచ్చిందంటే నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వీర్యదానం చేయడమే! దానివల్ల ఇప్పుడు 550 మందికి తండ్రి అయ్యాడు. ఇక చాలు, అతడు ఇకపై వీర్యదానం చేయకుండా ఆపాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది.

నెదర్లాండ్స్‌(Netherlands)కు చెందిన ఓ డాక్టర్‌ పెద్ద చిక్కులో పడ్డాడు. అతగాడికి అంత పెద్ద సమస్య ఏమొచ్చిందంటే నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వీర్యదానం చేయడమే! దానివల్ల ఇప్పుడు 550 మందికి తండ్రి అయ్యాడు. ఇక చాలు, అతడు ఇకపై వీర్యదానం చేయకుండా ఆపాలంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. పాపం ఈ మహిళ కూడా ఆ డాక్టర్‌ వీర్యాన్ని ఉపయోగించే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. హేగ్‌ నగరంలో నివసించే 41 ఏళ్ల జొనథన్‌ ఎం అనే డాక్టర్‌ నెదర్లాండ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 13 క్లినిక్‌లలో వీర్యదానం చేశాడు. ఇతడు ఇచ్చిన వీర్యంతోనే 550 మంది చిన్నారులు జన్మించారు.

నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి 12 కుటుంబాలకు మాత్రమే వీర్యదానం చేయాలి. కానీ జొనథన్ దీన్ని పట్టించుకోలేదు. తనను ఎవరూ పట్టుకోరన్న ధీమాతో వీర్యదానం చేస్తూ పోయాడు. 2017లోనే వీర్యదానం ద్వారా జొనథన్‌ వంద మందికి పైగా చిన్నారులకు జన్మనిచ్చాడని తేలింది. అప్పుడే నెదర్లాండ్స్‌ యంత్రాంగం అలెర్టయ్యింది. జొనథన్‌ దానం చేసిన వీర్యాన్ని వాడకూడదని దేశంలో ఉన్న అన్ని స్పెర్మ్‌ బ్యాంకులకు విన్నవించుకుంది. డచ్‌ సొసైటీ ఆఫ్‌ అబ్ట్సెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ -ఎన్‌వీఓజీ ఇతడిని బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దాంతో స్పెర్మ్‌ బ్యాంకులు ఇతడి వీర్యాన్ని తీసుకోవడానికి నిరాకరించాయి. అయినప్పటికీ జొనథన్‌ తన తీరు మార్చుకోలేదు. విదేశీయులకు తన వీర్యాన్ని దానం చేయడం మొదలు పెట్టాడని డోనర్‌కైండ్‌ సంస్థ ఆరోపిస్తోంది. వీర్యం అవసరమైన మహిళలతో సోషల్‌ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని అక్రమ మార్గాలలో వీర్యదానం చేశాడు. తాను ఎంతమందికి జన్మనిచ్చాననే విషయం స్పెర్మ్‌ బ్యాంకులకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. ఇప్పుడు ఇతడి వీర్యం వల్ల 550 మంది పుట్టారన్న విషయం తెలుసుకుని ప్రపంచం నెవ్వరపోతోంది. . ప్రస్తుతం జొనథన్‌ కెన్యాలో ఉన్నాడట! లాయర్లు కూడా ఇతడి తీరుతో ఆగ్రహంగా ఉన్నారు. ఇతడి వీర్యం ద్వారా పుట్టిన పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యాలు ఎలా ఉన్నాయో పరీక్షించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Updated On 29 March 2023 1:24 AM GMT
Ehatv

Ehatv

Next Story