Neeraja Accident Missouri : అమెరికాలో తెలంగాణ వైద్య విద్యార్థిని మృతి
మహబూబాబాద్(Mahbubabad) జిల్లా సిరోలు మండలం కాంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి వైద్య(Medicine) విద్యను చదువుతున్న నీరజ(Neeraja) (28) రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందింది. అమెరికాలోని మెస్సోరి(Messori) లూయిస్ యూనివర్సిటీలో(Louis University) పీజీ ఫస్టియర్ చదువుతున్న నీరజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది
మహబూబాబాద్(Mahabubabad) జిల్లా సిరోలు మండలం కాంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లి వైద్య(Medicine) విద్యను చదువుతున్న నీరజ(Neeraja) (28) రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందింది. అమెరికాలోని మెస్సోరి(Messori) లూయిస్ యూనివర్సిటీలో(Louis University) పీజీ ఫస్టియర్ చదువుతున్న నీరజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. కాంపల్లికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కూతురు నీరజ ఖమ్మం మమత మెడికల్ కాలేజ్‌లో(Khammam Medical college) బీడీఎస్(BDS) చదివింది. తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా(america) వెళ్లింది. డాక్టర్ పట్టా చేత పట్టుకొని తిరిగి వస్తుందనుకున్న తల్లిదండ్రులు.. విగత జీవిగా ఇంటికి రావడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
అమెరికాలో అక్టోబర్ 28న మార్కెట్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. శనివారం రాత్రి ఆమెరికా నుంచి నీరజ మృతదేహం వరంగల్‌కు చేరుకోగా.. ఆదివారం స్వ గ్రామానికి తీసుకొచ్చారు. నీరజకు వివాహం కాకపోవడంతో జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించి అంత్యక్రియలు నిర్వహించారు. నీరజ మరణవార్త తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కాంపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన నీరజ విగతజీవిగా సొంతూరుకు చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.