సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని(Solar Eclipse) వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్య గ్రహణాన్ని(Solar Eclipse) వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఏప్రిల్ 8వ తేదీన ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని(North america) కొన్ని ప్రాంతాలు, గ్రహణ సమయంలో, నాలుగు నిమిషాల తొమ్మిది సెకన్లపాటు చీకట్లోకి వెళ్లనున్నాయి. గతంలో చూసిన చంద్రగ్రహణాల కన్నా ఇది ఎక్కువ సమయమే. అందుకే, ఈసారి శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సూర్యుడితో పోలిస్తే చంద్రుడు భూమికి 400 రెట్లు దగ్గరగా ఉంటాడు. పరిమాణంలో సూర్యుడికన్నా చంద్రుడు 400 రెట్లు చిన్నది. సూర్యుడికీ, భూమికీ మధ్య చంద్రుడు వచ్చి, సూర్యుడు పూర్తిగా కనిపించని స్థితే సంపూర్ణ సూర్యగ్రహణం. శాస్త్రవేత్తలకు గ్రహణ సమయాలు ఎన్నో ప్రయోగాత్మక పరిశోధనలకు ముఖ్యమైనవి. ఏప్రిల్ 8న ఏర్పడనున్న సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ఉత్తరఅమెరికా ఖండంలో పూర్తిగా చూడొచ్చు