మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం.. మనం నివసిస్తున్న భూమిని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. భూమ్మీద నివసిస్తున్న సకల జీవరాశులు అగచాట్లు పడుతున్నాయి. తాజాగా ఆఫ్రికాలో(africa) భూమికి పగుళ్లు(Cracks) ఏర్పడుతున్నాయి.

మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం.. మనం నివసిస్తున్న భూమిని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకే వాతావరణ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. భూమ్మీద నివసిస్తున్న సకల జీవరాశులు అగచాట్లు పడుతున్నాయి. తాజాగా ఆఫ్రికాలో(africa) భూమికి పగుళ్లు(Cracks) ఏర్పడుతున్నాయి. ఇది ప్రకృతి వైపరీత్యమేనని అంటున్నారు నిపుణులు. మార్చి నెలలో ఆఫ్రికాలో చాలా చోట్ల భూమి పగిలింది. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయింది. ఇది చూసి స్థానికులు భయభ్రాంతులయ్యారు.

పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల(56KM) మేర ఉండటం గమనార్హం. జూన్‌కు(June) వచ్చే సరికి ఈ పగుళ్లు మరింత విస్తరించాయి. ఎర్ర సముద్రం(red sea) మొదలుకొని మోజాంబిక్‌(Mozambique) వరకు సుమారు 35 కిలో మీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే వాతావరణ మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే మాత్రం ఆఫ్రికా రెండు ముక్కలవ్వడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండు ఖండాల మధ్య నుంచి మహాసాగరం ఏర్పడుతుందని వారు చెప్పారు.

దీనిపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తలు టెక్టోనిక్‌ ప్లేట్‌లను(Tectonic Plates) అధ్యయనం చేస్తున్నారు. జరుగుతోన్న పరిణామాలపై నాసా కూడా దృష్టి సారించింది. ఈస్ట్‌ ఆఫ్రికాలోని(East africa) సొమాలియా(Somalia) టెక్టోనిక్‌ ప్లేట్ న్యూబియాన్‌(Nubian) టెక్టోనిక్‌ ప్లేట్‌కు తూర్పు దిశగా బలంగా కదులుతోందని నాసాకు చెందిన ఎర్త్‌ అబ్జర్వేటరీ(Earth Observatory) తెలిపింది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ లండన్‌ కూడా పరిశోధనలు చేస్తోంది. ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్‌లో పెనుముప్పు తప్పదంటున్నారు కాలిపోర్నియా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ అమెరిటస్‌ కెన్‌ . అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు.

Updated On 24 Jun 2023 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story