మరో గ్రహశకలం(asteroid)భూమిమీదకు దూసుకొస్తున్నట్లు నాసా(NASA) గుర్తించింది.

మరో గ్రహశకలం(asteroid)భూమిమీదకు దూసుకొస్తున్నట్లు నాసా(NASA) గుర్తించింది. సాధారణంగా భూమిపైకి దూసుకొచ్చే ప్రతి వస్తువుపై నాసా నిఘాపెడుతుంది. వాటి సామర్థ్యం, వేగం, వాటి పరిణామంపై అంచానలు రూపొందిస్తుంటుంది. 400 అడగులు భారీ గ్రహ శకలం భూమిని ఢీకొట్టకుండా తప్పిపోయిన సంగతి మర్చిపోకముందే మరో గ్రహశకలంతో భూమికి ముప్పు ఉందని నాసా అంచనా వేస్తోంది. 99 అడగులు మరో గ్రహశకలం భూమిమీదికి వస్తోందని నాసా ప్రకటించింది. ఈ గ్రహశకలానికి ఆస్టరాయిడ్‌ 2023 HB7 అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. భూమికి 34,90,000 మైళ్ల దూరంలో ఉందని తెలిపింది. ఇది ఎటెన్ గ్రహశకలాల సమూహానికి చెందినట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ ఇది ప్రమాదకర గ్రహశకలం అని మాత్రం శాస్త్రవేత్తలు ప్రకటించలేదు. దీంతో ఇది అంత పెద్ద ప్రమాదకరంగా పరిగణించడం లేదని తెలుస్తోంది. ఇది సెకనుకు 6.07 కి.మీ.వేగంతో ప్రయాణిస్తోంది. గంటకు ఈ గ్రహశకలం 21,840 కి.మీ.వేగంతో ఉంది. నాసా సంస్థ అధ్యయనం ప్రకారం ఇది జులై, 2025లో వస్తుందని, ఆ సమయంలో మరింత వేగంగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. ఆ సమయంలో ప్రస్తుత వేగం కంటే మూడు రెట్లు అధికంగా ప్రయాణిస్తుందని.. భయంకరంగా ఇది గంటకు 67,886 కి.మీ.వేగంతో దూసుకెళ్తుందని ప్రకటించింది.

ehatv

ehatv

Next Story