Gold In 16 Psyche : అప్పుడు తులం బంగారం రూ. 600కే దొరుకుతుంది!
అంతరిక్షంలో(space) ఓ అద్భుత నిధిని నాసా కనుగోంది.
అంతరిక్షంలో(space) ఓ అద్భుత నిధిని నాసా కనుగోంది. గ్రహశకలం 16 సైకిపై బోల్డంత సంపద ఉందని నాసా(NASA) అంటోంది. 1852లో అన్నీ బలే డి గాస్పరిస్ కనుగొన్న ఈ గ్రహశకలంలో టన్నుల కొద్దీ బంగారం, నిఖిల్, ప్లాటినం లోహాలు ఉన్నాయని కనుగొన్నారు. అంగారక, గురు గ్రహాల మధ్యలో ఉన్న ఈ గ్రహం శకలంలో లక్ష డాలర్ల క్వాడ్రిలియన్ విలువైన లోహాలు(Metals) ఉన్నట్టు నాసా తెలిపింది. (ఒక క్వాడ్రిలియన్ 1,000,000,000,000,000). దీన్ని బట్టి ఆ సంపద విలువ ఎంతో అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిని వెలికితీయడం అంత ఈజీ కాదు. 2029 నాటికి ఆస్టరాయిడ్‌లను చేరుకునే లక్ష్యంతో నాసా సైకి మిషన్‌ను 2023 అక్టోబర్ 13న ప్రారంభించింది. తన పరిశోధనలో భాగంగా గ్రహశకలం 16 సైకిపైన అపారమైన బంగారం(Gold), ప్లాటినం(Platinum), నిఖిల్ వంటి ఖరీదైన లోహాలు ఉన్నట్టు నాసా చెబుతుంది.. వాటిని భూమి మీదకు తెస్తే మాత్రం ప్రపంచ దేశాల స్థితిగతులే మారిపోతాయట! అయితే ప్రస్తుతం అంతరిక్ష మైనింగ్ సాంకేతికత తక్కువగా ఉంది . తక్కువ గురుత్వాకర్షణ, అధిక రేడియేషన్ ఉండే ఈ చిన్ని గ్రహ శకలంలో కార్యకలాపాలు నిర్వహించగల పరికరాలు ఇప్పుడు లేవు. ఆ మాటకొస్తే గ్రహాలపై ఖనిజాల తవ్వకం అతి ఖరీదైన వ్యవహారం. వాటిపై తవ్వకాలు జరపడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలు సమకూర్చుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. అయితే వీటిపై తవ్వకాలకు నిధులు సమకూర్చడానికి ప్రైవేట్ కంపెనీలు సంసిద్ధమవుతున్నాయి. ఒకవేళ అక్కడి నుంచి విలువైన లోహాలను ఇక్కడికి తెస్తే ఏమవుతుందో తెలుసా? ప్రస్తుతం 70 వేల రూపాయలు ఉన్న తులం బంగారం 600 రూపాయలకు దొరుకుతుంది. ప్లాటినమ్ ధరలు కూడా అమాంతం తగ్గుతాయి. అప్పుడు ఒంటి నిండా బంగారం వేసుకుని తిరగొచ్చు. బాగానే ఉంది కానీ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల ఆర్ధిక వ్యవస్థల్లో కుదుపులు ఏర్పడతాయి. పరిశ్రమలు, వివిధ రంగాలపై ఆ ప్రభావం పడుతుంది. ప్రజల దగ్గర ఉన్న ఆస్తుల విలువ కూడా తగ్గుతుంది.