PM Modi Greece Visit : ప్రధాని మోదీ గ్రీస్ పర్యటన.. నేడు కీలక భేటీలు
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి గ్రీస్‌కు వెళ్లారు. ప్రధాని మోదీ నేడు గ్రీస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Narendra Modi Greece Visit Updates Pm Departs For Athens From South Africa After BRICS Summit Conclusion
దక్షిణాఫ్రికా(South Africa)లోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన 15వ బ్రిక్స్ సదస్సు(BRICS Summit) ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) గురువారం రాత్రి గ్రీస్(Greece)కు వెళ్లారు. ప్రధాని మోదీ నేడు గ్రీస్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. గ్రీస్‌లో ప్రధాని మోదీకి లాంఛనంగా స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి, ప్రధానితో సమావేశమవుతారు. దీంతో పాటు ఇరు దేశాల వ్యాపార వర్గాలతో పాటు విదేశీ భారతీయులను కూడా కలవనున్నారు.
గ్రీస్‌కు బయలుదేరే ముందు, జోహన్నెస్‌బర్గ్(Johannesburg)లోని హోటల్ వెలుపల ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ ఎక్స్‌లో.. నా దక్షిణాఫ్రికా పర్యటన చాలా ఉపయోగకరంగా ఉంది. బ్రిక్స్ సదస్సు ఫలవంతమైనది, చారిత్రాత్మకమైనది. మేము ఈ వేదికపైకి కొత్త దేశాలను స్వాగతించాము. ప్రపంచ మేలు కోసం మేం కలిసి పని చేస్తూనే ఉంటాం. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా(Cyril Ramaphosa), ప్రజలు, ప్రభుత్వం వారి ఆతిథ్యానికి నా ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు.
గ్రీస్ పర్యటనలో ప్రధాని మోదీ ఆ దేశ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్(Kyriakos Mitsotakis)తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేసే మార్గాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యాపారవేత్తలతో పాటు భారతీయ కమ్యూనిటీతో కూడా ఆయన సంభాషించనున్నారు. 40 ఏళ్లలో గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం. అంతకుముందు అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ(Indira Gandhi) సెప్టెంబర్ 1983లో గ్రీస్‌లో పర్యటించారు.
