కోవిడ్‌(Covid) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న చైనా(Chaina)లో మరో మహమ్మారి విస్తరిస్తోంది. చైనా స్కూళ్లలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అక్కడి ఆస్పత్రుల్లో చేరే స్కూల్‌ పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మారి చైనాను కలవరపెడుతోంది. ఈ వ్యాధి విస్తరించడంతో చైనా వైద్యాధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో పలు స్కూళ్లును మూసివేస్తున్నారు.

కోవిడ్‌(Covid) నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్న చైనా(Chaina)లో మరో మహమ్మారి విస్తరిస్తోంది. చైనా స్కూళ్లలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో అక్కడి ఆస్పత్రుల్లో చేరే స్కూల్‌ పిల్లల సంఖ్య పెరిగిపోతుంది. ఈ మహమ్మారి చైనాను కలవరపెడుతోంది. ఈ వ్యాధి విస్తరించడంతో చైనా వైద్యాధికారుల్లో టెన్షన్‌ నెలకొంది. విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోవడంతో పలు స్కూళ్లును మూసివేస్తున్నారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరగడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధిని మిస్టీరియస్‌ న్యుమోనియా అని అధికారులు భావిస్తున్నారు.

బీజింగ్, లియానింగ్‌లో ఈ రోగం బారిన పడుతున్నవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన పిల్లల ఊపరితిత్తుల్లో వాపు, అధిక జ్వరంతో బాధపడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. మానవ, జంతు వ్యాధుల వ్యాప్తిని పరిశోధించే ఓపెన్-యాక్సెస్‌ సర్వైలెన్స్‌ ఫ్లాట్‌ఫారం చైనాలో విస్తరిస్తున్న ఈ మిస్టిరియస్‌ న్యుమోనియాపై ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్‌ సమయంలో డిసెంబర్ 2019లో కూడా చైనాకు హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత కోవిడ్-19 ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాప్తించి ఎందరినో బలి తీసుకోవడం, ఈ మహమ్మారి బారిన పడి పలువురు అనారోగ్యం పాలయ్యారు. వైద్యశాస్త్రం ధృవీకరించనప్పటికీ కోవిడ్‌ బారిన పడిన కొందరికీ ఇప్పటికీ ఆనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని, గుండెపోట్లు సంభవిస్తున్నాయన్న ప్రచారం వచ్చింది. మరోసారి ఇప్పుడు కూడా తెలియని శ్వాసకోశ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉందని ప్రోమెడ్‌ హెచ్చరించింది. చైనాలో వ్యాప్తిచెందుతున్న ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన పిల్లలను జాయిన్‌ చేయడంతో ఆస్పత్రుల మీద విపరీతంగా ఒత్తిడి పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. మిస్టీరియస్‌ న్యుమోనియా భయంతో చైనాలోని పలు స్కూళ్లు మూతపడుతున్నాయి. ఇది ప్రపంచానికి పాకితే పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయిని ప్రోమెడ్‌ హెచ్చరించింది.

Updated On 23 Nov 2023 12:35 AM GMT
Ehatv

Ehatv

Next Story