విహార యాత్రలు చేయడం అంటే అందరికి ఆసక్తి ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే వీలవుతుంది. అలాంటిది ప్రపంచ యాత్ర చేయాలంటే అది ఇంకా కష్టం అనే చెప్పాలి. అన్ని దేశాలు చుట్టేసి రావాడానికి కూడా సమయం కావాలి. ఫ్యామిలీ కానీ.. ప్రెండ్స్ కానీ ..బంధువులు ఇలా ఎవరైనా కంపెనీ ఉండాలి.

విహార యాత్రలు చేయడం అంటే అందరికి ఆసక్తి ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే వీలవుతుంది. అలాంటిది ప్రపంచ యాత్ర చేయాలంటే అది ఇంకా కష్టం అనే చెప్పాలి. అన్ని దేశాలు చుట్టేసి రావాడానికి కూడా సమయం కావాలి. ఫ్యామిలీ కానీ.. ప్రెండ్స్ కానీ ..బంధువులు ఇలా ఎవరైనా కంపెనీ ఉండాలి. అన్నీ ఉన్నా ఆర్ధికంగా ఉండాలి. అయితే ఖర్చయ్యే మనీ విషయం మీరు చూసుకోండి, మిగతావన్నీ మేం చూసుకుంటామంటున్నారు లైఫ్ ఎట్ సీ క్రూయిజ్ కంపెనీ నిర్వాహకులు. ఆ సంస్థ త్వరలోనే ప్రపంచ యాత్ర కోసం ఎంవీ జెమిని అనే ఓ భారీ షిప్ ని సిద్ధం చేస్దోంది.

ప్రపంచంలోని 135 దేశాలను 1095 రోజులు పాటు ఎంవీ జెమిని చుట్టేస్తుంది. అయితే మొత్తం ప్రయాణం 1.30 లక్షల మైళ్లు. వివిధ దేశాల్లో 375 పోర్టుల్లో ఈ భారీ నౌక ఆగుతుంది. అందులో 208 పోర్టుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే విడిది ఉంటుందట. మిగతా చోట్ల లంగరు వేసి దగ్గర్లోని అన్ని దేశాలు ఒకేసారి చుట్టేసి వస్తారు. ఈ క్రమంలో 103 దీవుల్ని కూడా ఈ నౌక కవర్ చేస్తుంది.

ఎమ్వీ జెమిని క్రూయిజ్ షిప్ లో ప్రపంచ యాత్ర చేపట్టాలంటే అన్ని పన్నులతో కలిపి 25 లక్షల రూపాయలు అవుతుంది ..ఇంత డబ్బు మన దగ్గర ఉంటే చాలు. సింగిల్ గా ప్రయాణించేవారికి 15శాతం రాయితీ కూడా ఉందట. నవంబర్-1న ఇస్తాంబుల్ నుంచి ప్రయాణం మొదలవుతుందని ..ఈ వరల్డ్ టూర్ కోసం బుకింగ్స్ మొదలయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

ఎమ్వీ జెమిని ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే .... ఈ జెమ్వీ షిప్ లో కొన్ని ఆకట్టుకునే సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఈ క్రూయిజ్ షిప్ లో 400 క్యాబిన్లు ఉంటాయి. మొత్తం 1074 మంది ప్రయాణికులకు వసతి సౌకర్యం ఉంది. 24 గంటల వైద్య సదుపాయం, డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వైఫై సదుపాయం, ఇతర టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది. రెస్టారెంట్లు, జిమ్, లైబ్రరీ, ఎంటర్టైన్మెంట్ జోన్ , ఆఫీస్ ఇలా అన్నీ హంగులతో సౌకర్యాలు ఉంటాయి. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న 14 వింతల్లో 13 వింతల వరకు ఈ టూర్ లో సందర్శించవచ్చు.

ఈ క్రూయిజ్ షిప్ లో ప్రయాణించాలంటే 25 లక్షలు ఉంటే సరిపోదు. దీర్ఘకాలిక వ్యాధులేవీ ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితులను అంచనావేసిన తర్వాతే ఇందులో ప్రయాణానికి అనుమతి ఉంటుంది. ఈ షిప్ లో ప్రయాణిస్తూ మధ్యలో వెనుదిరిగి వస్తామంటే అస్సలు కుదరదు . మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉండాలి అందుకే మానసికంగా, శారీరకంగా బలంగా ఉన్నవారినే తీసుకెళ్తామంటున్నారు నిర్వాహకులు. దానికితోడు షిప్ ఎక్కేముందే బాండ్ పేపర్ పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. మూడేళ్లలో తాము వెనక్కి తిరిగి వెళ్లమంటూ బాండ్ రాసివ్వాలనే కండిషన్ ఉంది . మరి మూడేళ్ల పాటు కుటుంబానికి దూరంగా, ఓన్లీ సముద్రంపైనే ఉండేంత సమయం , పెషేన్సీ , స్టామినాతో పాటు.. డబ్బులు కూడా దండిగా ఉన్నవారే ఈ ప్రయాణానికి సాహసించాలన్నమాట. అంటే ఒక రకంగా ఇది విహార యాత్రే కాదు, సాహస యాత్ర అని కూడా చెప్పుకోవాలి.

Updated On 8 March 2023 4:21 AM GMT
Ehatv

Ehatv

Next Story