అతగాడికి భూమ్మీద బోల్డన్ని నూకలు మిగిలున్నాయి కాబోలు అందుకే అంత్తెత్తు నుంచి కింద పడినా బతికి బట్టకట్టాడు. లేకపోతే సుమారు రెండు వేల అడుగుల ఎత్తునుంచి పడితే ఎవరైనా బతుకుతారా? విషయమేమిటంటే న్యూజిలాండ్‌లోని(Newzealand) నార్త్‌ ఐలాండ్‌లో(North Island) టరనకీ(Taranaki) అనే ఎత్తయిన పర్వతం ఉంది. దాన్ని అధిరోహించడానికి ఓ పర్వతారోహకుల బృందం బయలుదేరింది.

అతగాడికి భూమ్మీద బోల్డన్ని నూకలు మిగిలున్నాయి కాబోలు అందుకే అంత్తెత్తు నుంచి కింద పడినా బతికి బట్టకట్టాడు. లేకపోతే సుమారు రెండు వేల అడుగుల ఎత్తునుంచి పడితే ఎవరైనా బతుకుతారా? విషయమేమిటంటే న్యూజిలాండ్‌లోని(Newzealand) నార్త్‌ ఐలాండ్‌లో(North Island) టరనకీ(Taranaki) అనే ఎత్తయిన పర్వతం ఉంది. దాన్ని అధిరోహించడానికి ఓ పర్వతారోహకుల బృందం బయలుదేరింది. శనివారం ఉదయం ఎక్కడం మొదలుపెట్టారు. మధ్యాహ్నానికి 1,968 అడుగులపైకి చేరారు. ఆ సమయంలో ఓ పర్వతారోహకుడు అనూహ్యంగా జారి కిందపడిపోయాడు. కానీ అతడికి ఏమీ కాలేదు. చిన్నపాటి గాయాలయ్యాయంతే! అందుకు కారణం పడిన చోట మంచు(Snow) మెత్తగా మారడమే! వాతావరణ పరిస్థితులు అతడిని చావు నుంచి కాపాడాయన్నమాట! అతడు ప్రాణాలతో ఉండటం అద్భుతమైన విషయమే! ఈ మాటనే పోలీసులు కూడా అంటున్నారు. ఇతడానికి మంచి అదృష్టవంతుడు మరొకడు ఉండడంటున్నారు. న్యూజీలాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాల్లో టరనాకీ ఒకటి. ఇంతకు ముందు ఈ పర్వతం చాలా మంది ప్రాణాలు తీసుకుంది. 2021లో ఇద్దరు పర్వతారోహకులు జారిపడి చనిపోయారు. నార్త్‌ ఐలాండ్‌లోనే సుషుప్తావస్థలో ఉన్న అగ్నిపర్వతం ఒకటుంది. ఇతర పర్వతాల నుంచి వేరుపడినట్టుగా దూరంగా ఉండటం, తీరానికి దగ్గరలో ఉండటం, వాతావరణ పరిస్థితుల్లో వేగంగా మార్పులు జరుగుతుండటం వంటివి టరనాకీ పర్వతాల దగ్గర తప్ప మరెక్కడా ఉండవని మౌంటెన్‌ సేఫ్టీ కౌన్సిల్‌ అంటోంది.

Updated On 12 Sep 2023 1:36 AM GMT
Ehatv

Ehatv

Next Story