ఆధునిక కాలంలో రానురాను చాలా మార్పులు జరుగుతున్నాయి. పురుషులతో సమాన స్థాయిలో మహిళలు ఎదుగుతున్నారు.

ఆధునిక కాలంలో రానురాను చాలా మార్పులు జరుగుతున్నాయి. పురుషులతో సమాన స్థాయిలో మహిళలు ఎదుగుతున్నారు. మహిళలు ఇప్పుడు తమ వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు అంటే భార్య భర్తపై ఆధారపడి ఉండేది. ఆర్థిక వ్యవహారాలన్నీ భర్త చూసుకునేవాడు. కానీ కాలం మారింది. పురుషులతో పాటు సమానంగా మహిళలకు కూడా అవకాశాలు వస్తున్నాయి. ఓ నివేదిక ప్రకారం 2030 వరకు దాదాపు 45 శాతం(45%) మహిళలు ఒంటరిగానే ఉండనున్న వెల్లడయింది. 30-40 ఏళ్ల వయస్సులో ఉన్న మహిళలు కూడా విడాకుల తీసుకొని మళ్లీ పెళ్లి కూడా చేసుకోకూడదని భావిస్తున్నారట.

గతంలో మహిళలు తమ 20 ఏళ్ల ప్రారంభంలో తల్లులు అవుతారు. కానీ తల్లి కావాలన్న ఆలోచన వాయిదా వేసుకోవడం, ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత పిల్లలను కనొచ్చులే అన్న అభిప్రాయానికి మహిళలు వస్తున్నారని అధ్యయనం తెలిపింది. పని, జీవన సమతుల్యత, ఉద్యోగం, పిల్లలను కనే ఖర్చుతో సహా అనేక విషయాల గురించి మహిళలో ఆలోచన ప్రారంభమైంది. ఈ రోజుల్లో ఎక్కువ మంది మహిళలు తమ ఇళ్లలో ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటున్నారు. అలాగే శ్రామిక శక్తిలో వారిదే ప్రధాన భాగస్వామ్యం అవుతున్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం లభిస్తుండడంతో సొంత నిర్ణయాలు తీసుకొని పెళ్లిళ్లను, పిల్లలు కనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్ర రాబోయే సంవత్సరాల్లో మరింత కీలంగా మారుతుందని తెలుస్తోంది. పెళ్లయి పిల్లలున్న మహిళలు కూడా విడాకులు తీసుకొని ఒంటరిగా జీవిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారని ఈ నివేదిక వెల్లడించింది.

ehatv

ehatv

Next Story