Libya Denial Strom : ఆఫ్రికా దేశాలపై ప్రకృతి కన్నెర్ర.. నాలుగు రోజుల వ్యవధిలోనే 6 వేల మంది మృతి
ఆఫ్రికా దేశం(Africa) లిబియాలో(Libya) భయంకరమైన వరదలు(Floods) పెను విధ్వంసాన్ని సృష్టస్తున్నాయి. డెర్నా(Derna) నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వేలాది మంద మృత్యువాత పట్టారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వందలాది ఇళ్లు నేలకూలాయి. కూలిన ఇళ్ల శిథిలాలను తొలగిస్తుంటే వందలాది మృతదేహాలు బయటపడుతున్నాయి.
ఆఫ్రికా దేశం(Africa) లిబియాలో(Libya) భయంకరమైన వరదలు(Floods) పెను విధ్వంసాన్ని సృష్టస్తున్నాయి. డెర్నా(Derna) నగరం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వేలాది మంద మృత్యువాత పట్టారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వందలాది ఇళ్లు నేలకూలాయి. కూలిన ఇళ్ల శిథిలాలను తొలగిస్తుంటే వందలాది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే సుమారు మూడు వేల మంది చనిపోయారు. పది వేల మంది జాడ తెలియడం లేదు. మధ్యదరా సముద్రంలో ఏర్పడిన డేనియల్ తుఫాన్(Denial Strom) కారణంగా లిబియాలో భయంకరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని తోడు డెర్నా నగర శివార్లలో ఉన్న రెండు డ్యామ్‌లు(Dams) ధ్వంసమయ్యాయి. దీంతో ఒక్కసారిగా వరద నీరు జనవాసాలను ముంచెత్తింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపుగానే ప్రవాహం ప్రాణాలను తీసిది. వరద ధాటికి అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఎక్కడ చూసినా బురదే కనిపిస్తోంది. వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. తూర్పు లిబియాలోని అల్-బైదా, అల్-మర్జ్, సౌస, తోబ్రుక్, తాకెనిస్, అల్-బయాదా, బత్తాహ్, బెంఘాజీ మొదలైన నగరాలు, పట్టణాలలో కూడా జల ప్రవాహం విధ్వంసాన్ని సృష్టించింది.
మరో ఆఫ్రికా దేశం మొరాకోలో సంభవించిన భారీ భూకంపం ఇప్పటి వరకు మూడువేల మందికి పైగా ప్రాణాలు తీసింది. శిథిలాల నుంచి మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. మొరాకోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముర్రాకేశ్‌కు నైరుతి దిశగా 71 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత నమోదయ్యింది. ఇక్కడ ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి.