ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌ను సునాయసంగా ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న రష్యాను ఆ దేశం ముప్పుతిప్పులు పెడుతోంది. కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్‌పై రష్యా అధినేత పుతిన్‌ కోపం పెంచుకున్నాడు.

ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) దాడులు కొనసాగుతున్నాయి. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతూనే ఉంది. ఉక్రెయిన్‌ను సునాయసంగా ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న రష్యాను ఆ దేశం ముప్పుతిప్పులు పెడుతోంది. కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్‌పై రష్యా అధినేత పుతిన్‌ కోపం పెంచుకున్నాడు. సాధారణ పౌరులని కూడా చూడకుండా వారిపై దాష్టికాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఉక్రెయిన్‌పై జరిగిన రాకెట్ దాడిలో 51 మంది చనిపోయారు. మృతులలో చిన్నారులు కూడా ఉండటం విషాదం. భవంతుల శిథిలాలలో కొందరు చిక్కుకున్నారని సమాచారం. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టు టెలిగ్రాఫ్‌ పోస్ట్ పేర్కొంది. మరోవైపు, రెయిన్‌లోని ఖేర్సన్‌ రిజియన్‌లోని బెరిస్లావ్‌ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్‌ ఎమర్జెన్సీ స్టేషన​్‌పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.

Updated On 6 Oct 2023 12:37 AM GMT
Ehatv

Ehatv

Next Story