Libya Floods : లిబియాలో ప్రకృతి ప్రకోపం.. 2వేల మంది బలి.. వేలాది మంది గల్లంతు
తుపాను(storm) కారణంగా తలెత్తిన వరదలతో లిబియా(Libya) అతలాకుతలమవుతోంది. ఓ నగరంలో 2వేల మందికి పైగా మరణించి ఉంటారని లిబియా ప్రధాని ఒసామా హమద్(Osama Hamad) వెల్లడించారు. అనేక మంది గల్లంతయ్యారని తెలిపారు.
తుపాను(storm) కారణంగా తలెత్తిన వరదలతో లిబియా(Libya) అతలాకుతలమవుతోంది. ఓ నగరంలో 2వేల మందికి పైగా మరణించి ఉంటారని లిబియా ప్రధాని ఒసామా హమద్(Osama Hamad) వెల్లడించారు. అనేక మంది గల్లంతయ్యారని తెలిపారు.
ఆఫ్రికా(africa) దేశం లిబియాలోని దెర్నా నగరంలో సంభవించిన వరదల ధాటికి 2వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని ఆ దేశ ప్రధానమంత్రి ఒసామా హమద్ తెలిపారు. వేలాది మంది గల్లంతయ్యారని వెల్లడించారు. ఓ వార్తా సంస్థకు ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన దెర్నాలోని అనేక ప్రాంతాలు వరదలో కొట్టుకుపోయాయని చెప్పారు. మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను(Daniel lashes) లిబియాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో దెర్నా సైతం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు.
దెర్నాలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లు స్థానిక మీడియో తెలిపింది. విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అయితే తూర్పు లిబియా ఆరోగ్యశాఖ మంత్రి ఒత్మాన్ అబ్లుల్ జలీల్ సోమవారం మధ్యాహ్నం ఏఎల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూలో మరణాల సంఖ్యను ప్రకటించారు. 50 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే తాను చెప్పిన మరణాల సంఖ్యలో డెర్నా నగర మృతులను చేర్చలేదని చెప్పారు. షాహత్, ఒమర్ అల్-మొఖ్తర్ పట్టణాల్లో ఏడుగురు మరణించినట్లు వెల్లడించారు.
మధ్యధరా సముద్రంలో సంభవించిన డేనియల్ తుపాను.. లిబియాను అతలాకుతలం చేస్తోంది. ఈ తుపాను ధాటికి ఇప్పటికే తూర్పు లిబియాలోని అనేక ప్రాంతాల్లో కల్లోలిత పరిస్థితులు నెలకొన్నాయి. తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో దెర్నా సైతం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని డిజాస్టర్ జోన్‌గా ప్రకటించారు.
దెర్నాలో పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నట్లు స్థానిక మీడియో తెలిపింది. విద్యుత్ లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. చుట్టూ వరద నీరు చేరడం వల్ల ఇళ్లల్లో ఉన్న ప్రజలు.. సహాయం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపింది.
అయితే తూర్పు లిబియా ఆరోగ్యశాఖ మంత్రి ఒత్మాన్ అబ్లుల్ జలీల్ సోమవారం మధ్యాహ్నం ఏఎల్-అరేబియా న్యూస్ ఛానెల్‌కు టెలిఫోన్ ఇంటర్వ్యూలో మరణాల సంఖ్యను ప్రకటించారు. 50 మంది గల్లంతైనట్లు తెలిపారు. అయితే తాను చెప్పిన మరణాల సంఖ్యలో డెర్నా నగర మృతులను చేర్చలేదని చెప్పారు. షాహత్, ఒమర్ అల్-మొఖ్తర్ పట్టణాల్లో ఏడుగురు మరణించినట్లు వెల్లడించారు.