సమస్త జీవరాశులలో తనకే తెలివితేటలు ఎక్కువని మనిషి విర్రవీడుగుతుంటాడు కానీ ప్రతీ జీవికి తెలివి ఉంటుంది. మనుగడ కోసం ఆలోచన చేస్తాయి. అడవులలో జీవించే జంతువులకు వైద్యం చక్కగా తెలుసు. గాయమో, మరోటో ఏర్పడితే వాటికవే వైద్యం చేసుకుంటాయి.

సమస్త జీవరాశులలో తనకే తెలివితేటలు ఎక్కువని మనిషి విర్రవీడుగుతుంటాడు కానీ ప్రతీ జీవికి తెలివి ఉంటుంది. మనుగడ కోసం ఆలోచన చేస్తాయి. అడవులలో జీవించే జంతువులకు వైద్యం చక్కగా తెలుసు. గాయమో, మరోటో ఏర్పడితే వాటికవే వైద్యం చేసుకుంటాయి. ఈ విషయాన్ని ఇండోనేషియాలో(Indonesia) పరిశోధకులు గుర్తించి రికార్డు చేశారు. సుమత్రన్‌ ఒరాంగుటాన్స్‌ అనే జాతికి చెందిన ఓ మగ కోతి(Kothi) ఇలాగే గాయానికి(wound) చికిత్స(Treatment) చేసుకుంది. రెండు మగకోతుల మధ్య జరిగిన గొడవలో ఓ కోతి ముఖానికి గాయమయ్యింది. అప్పుడది ఏం చేసిందంటే.. ఫైబ్రూరియా టింక్చర్‌ అనే మొక్కల ఆకులతో సొంతంగా వైద్యం చేసుకుంది. ముందుగా ఆ మొక్క ఆకులు నమిలింది. వాటి పసరును గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతే కాదు గాయం మానడానికి సాధారణం కంటే ఎక్కువ సేపు పడుకుందని పరిశోధకులు గుర్తించారు. ఫైబ్రూరియా టింక్చర్‌లో నిజంగానే ఔషధ గుణాలు ఉన్నాయట! మలేరియా, విరేచనాలు, డయాబెటిస్‌ చికిత్సలో ఈ మొక్కలను వాడతారట!

Updated On 4 May 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story