Mocha Typhoon : విరుచుకుపడనున్న మోచా తుఫాన్
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం మోచా తుఫాన్‌గా(Mocha Typhoon) మారనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులలో(Andaman and Nicobar Islands) భారీ వర్షాలు(rains) కురుస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమయ్యింది.

vMocha Typhoon
బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం మోచా తుఫాన్‌గా(Mocha Typhoon) మారనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులలో(Andaman and Nicobar Islands) భారీ వర్షాలు(rains) కురుస్తాయి. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమయ్యింది. ఇవాళ అది భీకర మోచా తుఫాన్‌గా మారబోతున్నది. బంగాళాఖాతం ఆగ్నేయ, సమీప ప్రాంతాలలో కూడా తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడతాయ. శనివారం నాటికి కాస్త బలహీనపడనుంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్, మయన్మార్‌లోని క్యావూక్‌వ్యూ పట్టణాల మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశాలున్నాయి. ఆదివారం అంటే మే 14న గంటలకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
