కొండచిలువలు పెద్ద పెద్ద జంతువులను కూడా అమాంతం మింగేస్తూ

కొండచిలువలు పెద్ద పెద్ద జంతువులను కూడా అమాంతం మింగేస్తూ ఉంటాయని తెలిసిందే. అయితే కొన్ని దేశాల్లో ఏకంగా మనుషులను మింగేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తప్పిపోయిన ఇండోనేషియా మహిళ పాము కడుపులో కనిపించిందని స్థానిక అధికారి తెలిపారు. 45 ఏళ్ల ఫరీదాను దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని కలెంపాంగ్ గ్రామంలో ఆమె భర్త, ఇతర వ్యక్తులు కొండచిలువ కడుపు లోపల కనుగొన్నారు. కొండచిలువ 5 మీటర్లు (16 అడుగులు) ఉంది.

గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. ఆ తరువాత సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. ఆమె భర్త ఆమెకు సంబంధించిన వస్తువులను కనుగొన్నారు.. ఇది అతనికి అనుమానం కలిగించింది. గ్రామస్థులు ఆ ప్రాంతంలో వెతికగా.. వారు వెంటనే పెద్ద పొట్టతో ఉన్న కొండచిలువను గుర్తించారు. ఇండోనేషియాలో కొండచిలువలు మనుషులను మింగేసిన ఇలాంటి సందర్భాలు చాలా అరుదని అధికారులు చెబుతున్నారు.

Updated On 9 Jun 2024 6:59 AM GMT
Yagnik

Yagnik

Next Story