బంగ్లాదేశ్‌ రగిలిపోతున్నది. అల్లర్లతో అట్టుడుకుతున్నది. హింస చెలరేగుతున్నది. నియంత్రించాల్సిన సైన్యం చేతులెత్తేసింది.

బంగ్లాదేశ్‌ రగిలిపోతున్నది. అల్లర్లతో అట్టుడుకుతున్నది. హింస చెలరేగుతున్నది. నియంత్రించాల్సిన సైన్యం చేతులెత్తేసింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొన్ని నెలల క్రితం శాంతియుతంగా మొదలైన నిరసనలు హింసకు దారి తీశాయి. దేశ వ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనలతో ప్రధానమంత్రి షేక్‌ హసీనా (PM Sheikh Hasina)వణికిపోయారు. ప్రధానమంత్రి ఇంటినే ఆందోళనకారులు చుట్టుముట్టడంతో

ప్రాణభయంతో దేశం వదిలిపారిపోయారు. తన సోదరి షేక్ రెహానా(Sheikh Rehana)తో కలసి ఆర్మీ హెలికాప్టర్‌లో దేశం వదిలి ఇండియా(India)కు వచ్చారు. షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను వదిలి వెళ్లిన తర్వాత ఆమె ఇంట్లోకి చొరబడ్డారు ఆందోళనకారులు. హసీనా ఇంట్లో ఉన్న ఫర్నీచర్‌(Furniture) ఇతర వస్తువులను పగలగొట్టి.. కొన్ని వస్తువులను ఎత్తుకెళ్లారు. మరోవైపు, బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంతో భారత్ అలర్ట్ అయింది. బంగ్లాదేశ్‌ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించి సరిహద్దు గ్రామాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరోవైపు, భారత్‌ నుంచి బంగ్లాదేశ్‌కు రెగ్యులర్‌గా నడిచే అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే(Indian Railways) ప్రకటించింది.

ehatv

ehatv

Next Story