ఈ భూమ్మీద నమ్మకాలు లేని చోటంటూ లేదు. మనుషులున్న చోట నమ్మకాలు ఉంటాయి. కాకపోతే కొందరికి అవి వింతగా అనిపిస్తాయి. ఊరి మేయర్‌ మొసలిని పెళ్లి చేసుకోవడమన్నది ఈ కోవకే వస్తుంది. మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా ఊరు మేయర్లు మెసలిని పెళ్లి చేసుకోవడం ఓ ఆనవాయితీ! ఆచారం! అలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నది ఓ నమ్మకం. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో మేయర్‌ నిస్సంకోచంగా మొసలిని పరిణయమాడతారు.

ఈ భూమ్మీద నమ్మకాలు లేని చోటంటూ లేదు. మనుషులున్న చోట నమ్మకాలు ఉంటాయి. కాకపోతే కొందరికి అవి వింతగా అనిపిస్తాయి. ఊరి మేయర్‌ మొసలిని పెళ్లి చేసుకోవడమన్నది ఈ కోవకే వస్తుంది. మెక్సికోలోని శాన్‌ పెడ్రో హువామెలులా ఊరు మేయర్లు మెసలిని పెళ్లి చేసుకోవడం ఓ ఆనవాయితీ! ఆచారం! అలా చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్నది ఓ నమ్మకం. తన ఊరికి మంచి జరగాలనే ఉద్దేశంతో మేయర్‌ నిస్సంకోచంగా మొసలిని పరిణయమాడతారు. అన్నట్టు ఈ పెళ్లి కూడా ఏదో తూతూ మంత్రంగా జరగదు.. పెద్ద ఎత్తున, ఘనంగా జరుగుతుంటుంది. ఊరు ఊరంతా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. లేటెస్ట్‌గా శాన్ పెడ్రో హువామెలులా మేయర్‌ (Mexican Mayor) విక్టర్‌ హ్యుగో సోసా తన ప్రజలకు మంచి జరగాలనే సదుద్దేశంతో అలిసియా అడ్రియానా అనే మొసలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆచారం ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు కానీ 230 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నదని పెద్దలు చెబుతుంటారు. దీనిని అక్కడి ప్రజలు ఇప్పటికీ కొనసాగిస్తుండటం విశేషమే. నేలతల్లి చల్లగా ఉండాలని, వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటారు. మొసలిని పెళ్లి చేసుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని హ్యూగో సోసా చెప్పుకొచ్చారు. వివాహ వేడుకకు ముందుగా ఈ మొసలిని ఇంటి ఇంటికి ఊరేగింపుగా తిప్పుతారు. ఆ తర్వాత ఆ మొసలిని కూడా అందమైన పెళ్లి కూతురు మాదిరిగా ముస్తాబు చేస్తారు. అసలే మొసలి కదా! పెళ్లి వేడుకలో తన సహజస్వభావం కొద్దీ ఎవరిమీదైనా దాడికి దిగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా దాని నోటికి తాళం వేస్తారు. ఈ పెళ్లి కార్యక్రమంలో ఇరువురం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం కాబట్టి ఆమె బాధ్యతను తాను స్వీకరిస్తున్నట్లు మేయర్‌ ప్రమాణం చేసి మరీ మొసలిని పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మేయర్‌ ఆ మొసలితో కలిసి ఆనందంగా నృత్యం చేస్తాడు. చివరిగా దాని ముద్దాడతాడు. దాంతో పెళ్లి వేడుక ముగుస్తుంది. తమ మేయర్‌ ఇలా మొసలిని పెళ్లి చేసుకోవడం వల్ల తమ వలలో లెక్కకు మించిన చేపలు పడతాయని స్థానిక జాలర్లు ఆనందంగా చెబుతున్నారు.

Updated On 3 July 2023 3:14 AM GMT
Ehatv

Ehatv

Next Story