సుల్తాన్‌ అంటే సుల్తానే మరి! పేరుకు చిన్న దేశానికి సుల్తానే అయినప్పటికీ సంపదలో మాత్రం అతి పెద్ద!

సుల్తాన్‌ అంటే సుల్తానే మరి! పేరుకు చిన్న దేశానికి సుల్తానే అయినప్పటికీ సంపదలో మాత్రం అతి పెద్ద! ఆయన బ్రూనే సుల్తాన్‌! పేరు సుల్తాన్‌ హస్సనాల్ బోల్కియా (Sultan Haji Hassanal Bolkiah).ఇప్పుడాయన ప్రస్తావన ఎందుకంటే ఇవాళ మన ప్రధానమంత్రి మోదీ అక్కడికి వెళుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలను బలోపేతం కానున్నాయి. సరే, మళ్లీ బోల్కియా దగ్గరకు వద్దాం.. ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. ఆయన దగ్గర సుమారు అయిదు బిలియన్‌ డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయంటేనే ఆయన ఎంత సంపన్నుడో తెలుస్తోంది. ఆ చిట్టి దేశంలో ఆయిల్‌, గ్యాస్‌ నిక్షేపాలు అపారం. అందుకే అది సంపన్నదేశమయ్యింది. దాన్ని పాలిస్తున్న రాజు సంపన్నుడు అయ్యాడు. ఇంధన, గ్యాస్‌ రిజర్వ్‌ల నుంచి సుల్తాన్‌ సుమారు 30 బిలియన్ల డాలర్లు సంపాదించారు. బోల్కియా దగ్గర ఏడు వేల లగ్జరీ కార్లు ఉన్నాయి. అందులో 600 రోల్స్‌ రాయిస్‌ కార్లు, 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు ఉన్నాయి. పోర్షే, లాంబోర్గిని, మేబాచ్‌, జాగ్వార్‌, బీఎండబ్ల్యూ, మెక్‌లారెన్‌ కార్లు కూడా బోలెడన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఓ బోయింగ్ 747 విమానం కూడా ఉంది. ఇవన్నీ ఏం చేసుకుంటారని మాత్రం అడక్కండి. ఇకపోతే ఆయన కలెక్షన్లలో బెంట్లీ డామినేటర్‌ ఎస్‌యూవీ అత్యంత ప్రత్యేకం. దాని విలువ ఎంత కాదనుకున్నా 80 మిలియన్ల డాలర్లు ఉంటుంది. పోర్షె911 హారిజన్‌ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్‌ ప్లేట్‌ రోల్స్‌ రాయిస్‌ సిల్వర్‌ స్పర్‌ 2 కార్లు కూడా ఉన్నాయి. క‌స్ట‌మ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువ‌రాణి మ‌జేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును సుల్తాన్‌ కొన్నాడు. ఇన్నేసి కార్లు ఉన్న ఆయన నివాసం గురించి కూడా తెలుసుకోవాలిగా! ఇస్తానా నూరుల్‌ ఇమాన్‌ ప్యాలెస్‌లో ఆయన ఉంటారు. అతిపెద్ద రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్‌గా గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు ద‌క్కించుకున్న ఆ భవంతి సుమారు 20 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులుపైనే ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంతో ఆ భ‌వంతిని తాపడం చేశారు. ఆ రాజమందిరంలో అయిదు స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్ రూమ్స్‌, 257 బాత్ రూమ్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. అన్నట్టు ఆ రాజుకు ఓ జూ కూడా ఉంది. అందులో 30 బెంగాలీ టైగర్లు, అనేక రకాల జాతుల పక్షులు ఉన్నాయి.

Updated On 3 Sep 2024 12:09 PM GMT
ehatv

ehatv

Next Story