Fire Bull Festival : స్పెయిన్‌లో జరిగే వికృత క్రీడ... పైత్యానికి పరాకాష్ట ఫైర్ బుల్ ఫెస్టివల్..
స్పెయిన్‌లో(spain) జరిగే బుల్‌ఫైట్(Bull Fight) చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ప్రమాదకరమైన ఆ క్రీడలో చాలా మంది గాయపడుతుంటారు. అక్కడే బుల్‌రన్ అనే వేడుక కూడా జరుగుతుంది. ఎద్దులను పరుగెత్తిస్తూ ఆనందపడతారు జనం. మన జల్లికట్టు(jallikattu) క్రీడకే లెక్చర్లు ఇచ్చే వారు స్పెయిన్‌లో జరిగే పైశాచికమైన ఆటను చూసి ఏమంటారో!
స్పెయిన్‌లో(spain) జరిగే బుల్‌ఫైట్(Bull Fight) చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ప్రమాదకరమైన ఆ క్రీడలో చాలా మంది గాయపడుతుంటారు. అక్కడే బుల్‌రన్ అనే వేడుక కూడా జరుగుతుంది. ఎద్దులను పరుగెత్తిస్తూ ఆనందపడతారు జనం. మన జల్లికట్టు(jallikattu) క్రీడకే లెక్చర్లు ఇచ్చే వారు స్పెయిన్‌లో జరిగే పైశాచికమైన ఆటను చూసి ఏమంటారో! ఆ క్రీడ పేరు ఫైర్‌బుల్ ఫెస్టివల్(Fire Bull Festival). అసలు దీన్ని ఫెస్టివల్ అనడమే తప్పు. స్పెయిన్‌వాసుల సరదా చూస్తే ఇది పైత్యానికి పరాకాష్ట అని అనిపించక మానదు..
చూశారుగా ఎంత భయంకరమైన ఆటో..! ఎద్దులతో(Bulls) పోరాటాలు చేయడమే తప్పు.. ఎద్దులను పరుగెత్తిస్తూ వాటి వెంట పడటం ఇంకా పెద్ద తప్పు.. ఇదిగో ఇలా కొమ్ములకు నిప్పు(Fire) పెట్టి ఎంజాయ్ చేయడం చాలా చాలా పెద్ద తప్పు.. ఏమైనా అంటే అది తమ సంస్కృతిలో భాగమంటారు వారు.. ప్రతి సంవత్సరం జరిగే ఈ ప్రాణాంతక క్రీడను(Deadly sport) వారు టోరో డి జుబిలో(Toro de Jubilee) అని పిలుచుకుంటారు. దేవుడి దయ వల్ల స్పెయిన్ అంతటా ఇది జరగదు.. కేవలం మెడినాసెలీ(Medinaceli) పట్టణంలో మాత్రమే జరుగుతుందీ ఫైర్ బుల్ ఫెస్టివల్. అర్థరాత్రి పన్నెండు గంటల తర్వాతే ఈ వికృత క్రీడ మొదలవుతుంది.. తొలుత మైదానం మధ్యలో స్తంభాన్ని పాతి, దానికి ఎద్దును కట్టేస్తారు. తేలికగా మండే స్వభావం కలిగిన తారు ముద్దలను బంతులుగా చేసి ఆ ఎద్దు కొమ్ములకు అమరుస్తారు. తర్వాత ఆ తారు ముద్దలకు నిప్పు పెడతారు.. మంటలు అంటుకున్నాక స్తంభానికి కట్టేసిన ఎద్దును వదిలేస్తారు.
ఎద్దు కొమ్ములకు అంటుకున్న మంట చిమ్మటి చీకట్లో కాగడాల్లా కనిపిస్తాయి.. ఆ మంటల వేడికి తట్టుకోలేక ఎద్దు భయంతో బాధతో అటూ ఇటూ పరుగెడుతుంటుంది.. అడ్డం వచ్చిన వారిని కుమ్మేయడానికి ప్రయత్నిస్తుంది. భీతిల్లిన ఆ ఎద్దుతో ఆటలాడుకోవడం వాళ్లకో సరదా. ఈ ఆటను చూడ్డానికి వచ్చిన వారు కేరింతలు కొడుతు ఎద్దును ఆటపట్టిస్తున్నవారిని ఎంకరేజ్ చేస్తుంటారు.. పాపం తారు ముద్దలు మంటలకు పూర్తిగా కరిగిపోయే వరకు ఎద్దులు ఇలా భయంతో పరుగులు పెడుతూనే ఉంటాయి..మండల వేడి ఎద్దుకు తగలకుండా మొహం నిండా బురద పూస్తారు.. ఎంత బురద పూసినా వేడి తగలకుండా ఉంటుందా ..? వారి పిచ్చికాని..! జంతు ప్రేమికులు ఈ వికృత క్రీడను నిషేధించమంటూ తెగ ఆందోళనలు చేస్తున్నారు.. నిర్వాహకులకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు.. నిరసనలు ఎక్కువైతే ఆటను కాసేపు వాయిదా వేస్తారంతే! అంతకు మించి ఆపడమనేది ఇంత వరకు జరగలేదు..