ఏకధ్రువ ప్రపంచంలో అమెరికాదే పెత్తనం అయ్యింది. ప్రపంచదేశాలకు పెద్దన్నగా అగ్రరాజ్యం హవా చెలాయిస్తున్నది. అమెరికా తల్చుకుంటే రెండు మిత్రదేశాల మధ్య కూడా సెగ పుట్టించగలదు. అంత పవర్‌ఫుల్ దేశమది! ఇక ఆ దేశ అధ్యక్షుడు(PResident) కూడా ప్రపంచంలోనే శక్తివంతమైన నేత! ఆయన ఉండే నివాసం, ప్రయాణించే విమానం అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అమెరికా(America) అధ్యక్షులు నివసించే భవంతిని వైట్‌ హౌస్‌(White house) అంటారని మనకు తెలుసు.

ఏకధ్రువ ప్రపంచంలో అమెరికాదే పెత్తనం అయ్యింది. ప్రపంచదేశాలకు పెద్దన్నగా అగ్రరాజ్యం హవా చెలాయిస్తున్నది. అమెరికా తల్చుకుంటే రెండు మిత్రదేశాల మధ్య కూడా సెగ పుట్టించగలదు. అంత పవర్‌ఫుల్ దేశమది! ఇక ఆ దేశ అధ్యక్షుడు(PResident) కూడా ప్రపంచంలోనే శక్తివంతమైన నేత! ఆయన ఉండే నివాసం, ప్రయాణించే విమానం అన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అమెరికా(America) అధ్యక్షులు నివసించే భవంతిని వైట్‌ హౌస్‌(White house) అంటారని మనకు తెలుసు. ఆ భవంతి ఎంత స్ట్రాంగ్‌ అంటే అణ్వాయుధాలకు కూడా తట్టుకుని నిలబడుతుంది. ప్రత్యేక బంకర్లు ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి కూడా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విమానాన్ని ఎయర్‌ఫోర్స్‌ వన్‌(Air FOrce One) అని అంటారు. ఈ విమానంలో అనేక అత్యాధునిక సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయి. క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను కూడా తట్టుకోగల రక్షణ వ్యవస్థ ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో ఉంది. అగ్ర రాజ్యాధినేత ప్రయాణించే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. అయితే అలాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో వరుస చోరీలు(Theft) జరుగుతుండటం అమెరికా అధికార వర్గాలను కంగారు పుట్టించింది. దొంగలను పట్టుకునేందుకు భద్రతాధికారులు నిఘా ఏర్పాటు చేశారు. చివరకు దొంగలను పట్టేసుకున్నారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో వరుస దొంగతనాలు చేస్తోన్నది ఎవరో కాదు మీడియా ప్రతినిధులని తేలింది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా దేశీ, విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు ఆయనతోపాటు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులను(Media Representatives) కూడా వెంట తీసుకెళ్తారు. వారు కూడా అమెరికా అధ్యక్షుడితోపాటే ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణిస్తారు. ఈ క్రమంలో తాము అమెరికా అధ్యక్షుడితో కలిసి విమానంలో, అదీ కూడా ఆయన సొంత విమానంలో ప్రయాణించామని చెప్పుకోవడానికి ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ లో మీడియా ప్రతినిధులు దొంగతనాలకు పాల్పడుతున్నారట! స్వయంగా ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక పొలిటికో తెలిపింది. అమెరికా అధ్యక్షుడితోపాటు ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ప్రయాణించే మీడియా ప్రతినిధులు అందులోని విస్కీ, వైన్‌ గ్లాసులు, బంగారం పూత పూసిన పింగాణీ ప్లేట్లు ఇలా ఏది కనిపిస్తే దాన్ని దొంగిలిస్తున్నారు. అంతేకాకుండా గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ బ్యాగుల్లో పెట్టేసుకుని వెంట తెచ్చేసుకుంటున్నారట! మీడియా ప్రతినిధుల వరుస దొంగతనాలు రచ్చకెక్కడంతో ఇటీవల ది వైట్‌ హౌస్‌ కరస్పాండెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేల్లీ ఓడేనియల్‌ మీడియా ప్రతినిధులను మందలించారు. అమెరికా అధ్యక్షుడితోపాటు తాము ప్రయాణించామని చెప్పుకోవాలని కోరిక ఉంటే తామే అమెరికా అధ్యక్షుడితో ఉన్న వారి ఫొటోలను పంపుతామని, దొంగతనాలు మానుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల పిల్లో కేస్‌ ను దొంగిలించిన ఒక మీడియా ప్రతినిధి తిరిగి దాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేశారని అంటున్నారు.

Updated On 1 April 2024 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story