ముర్డోక్ గతంలో నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. గత సంవత్సరం

మీడియా దిగ్గజం 'రూపర్ట్ ముర్డోక్' 93 సంవత్సరాల వయస్సులో ఐదవ సారి వివాహం చేసుకున్నాడు. ఆయన కంటే ఇరవై ఐదు సంవత్సరాలు చిన్న వయస్సు గల రిటైర్డ్ మాలిక్యులర్ బయాలజిస్ట్‌ ను పెళ్లి చేసుకున్నారు. 67 ఏళ్ల ఎలెనా జుకోవాను శనివారం నాడు కాలిఫోర్నియా వైన్యార్డ్ మొరాగా అనే ఎస్టేట్‌లో వివాహం చేసుకున్నారు. మర్డోక్ యాజమాన్యంలోని బ్రిటీష్ టాబ్లాయిడ్ ది సన్‌లో ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను పోస్టు చేశారు.

ముర్డోక్ గతంలో నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. గత సంవత్సరం, ముర్డోక్ తన నిశ్చితార్థాన్ని డెంటల్ హైజీనిస్ట్‌గా మారిన కన్జర్వేటివ్ రేడియో హోస్ట్ ఆన్ లెస్లీ స్మిత్‌తో ప్రకటించాడు, అయితే ఒక నెల కంటే తక్కువ సమయంలోనే వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. రష్యా నుంచి అమెరికాకు వలస వెళ్లిన జుకోవా, మాలిక్యులర్ బయాలజిస్ట్ గా రిటైర్డ్ అయింది.

ఆస్ట్రేలియాలో జన్మించిన ముర్డోక్ మీడియా దిగ్గజం. ఆయన మీడియా సామ్రాజ్యంలో ది వాల్ స్ట్రీట్ జర్నల్, ఫాక్స్ న్యూస్ ఉన్నాయి. ఇంకా ప్రభావవంతమైన మీడియా అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఫోర్బ్స్ ప్రకారం అతని కుటుంబానికి దాదాపు $20 బిలియన్లు ఉన్నాయి.

Updated On 2 Jun 2024 9:45 PM GMT
Yagnik

Yagnik

Next Story