అమెరికా రాజకీయాలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(US House Of Representative) స్పీకర్‌ మెక్‌కార్తి(Mccarthy) తన పదవిని కోల్పోవడం సంచలనం కలిగిస్తోంది. మెక్‌కార్తిపై ప్రవేశపెట్టిన మోషన్‌ టు వెకేట్‌(Motion To Vacate) అన్న తీర్మానానికి సొంత పార్టీ రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు.

అమెరికా రాజకీయాలలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌(US House Of Representatives) స్పీకర్‌ మెక్‌కార్తి(Mccarthy) తన పదవిని కోల్పోవడం సంచలనం కలిగిస్తోంది. మెక్‌కార్తిపై ప్రవేశపెట్టిన మోషన్‌ టు వెకేట్‌(Motion To Vacate) అన్న తీర్మానానికి సొంత పార్టీ రిపబ్లికన్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు. దాంతో మెక్‌కార్తి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. 234 ఏళ్ల అమెరికా చరిత్రలో ఓటింగ్‌ ద్వారా స్పీకర్‌ను తొలగించడం ఇదే ప్రథమం. అధికారిక డెమొక్రట్లకు మెక్‌కార్తి సహకరిస్తున్నారనే కోపం రిపబ్లికన్లకు ఉంది. ఈ క్రమంలోనే డెమొక్రట్స్‌ ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు.

మంగళవారం జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా 216 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 210 ఓట్లు పడ్డాయి. ఎనిమిది మంది రిపబ్లికన్‌ రెబెల్స్‌ ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. అందులో రిపబ్లికన్ల రెబల్‌ గ్రూప్‌ నేత మ్యాట్‌ గాయెట్జ్‌ కూడా ఉన్నారు.అధ్యక్షుడు జో బైడెన్‌పై(Joe Biden) అభిశంసన విచారణకు అనుమతి ఇవ్వడంలో మెక్‌కార్తి అలసత్వాన్ని ప్రదర్శించడం రిపబ్లికన్లకు ఆగ్రహం తెప్పించింది. అయితే అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతుండడం, ట్రంప్‌పై(Trump) న్యాయపరమైన చిక్కులు తదితరాల కారణాలతో కోపాన్ని నియంత్రించుకుంటూ సంయమనం పాటించారు.

ఈ తరుణంలోనే ప్రభుత్వ షట్‌డౌన్‌ను నివారించడానికి నిధులను పాస్ చేయడానికి డెమొక్రాట్‌లపై ఆయన ఆధారపడటాన్ని రిపబ్లికన్లలో కొందరు సహించలేకపోయారు. ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేసే ప్రతీకారం తీర్చుకున్నారు. మెక్‌కార్తితో చాన్నళ్లుగా వైరం ఉన్న రిపబ్లికన్‌ రెబల్‌ మ్యాట్‌ గాయెట్జ్‌.. ఈ తీర్మానాన్ని ముందుండి నడిపించారు. 2022 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీకి సెనేట్‌లో స్వల్ఫ ఆధిక్యం లభించింది. హౌజ్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌లో మాత్రం రిపబ్లికన్‌ పార్టీకి మెజారిటీ లభించడంతో మెక్‌కార్తికి స్పీకర్‌ అవకాశం వచ్చింది.

రిపబ్లికన్‌ పార్టీ తరపున కాలిఫోర్నియా 20th కాంగ్రెసియోనల్‌ డిస్ట్రిక్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారాయన. 58 ఏళ్ల మాజీ ఎంటర్‌ప్రెన్యూర్‌ అయిన మెక్‌కార్తి యూఎస్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు ఈ ఏడాది జనవరిలో 55వ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నిక కూడా ఆషామాషీగా జరగలేదు. 1910లో తిరుగుబాటు తర్వాత జోసెఫ్‌ జి కెనాన్‌ను తొలగించేందుకు మోషన్‌ ప్రవేశపెట్టారు. కానీ, అది విఫలమైంది. 2015లోనూ జాన్‌ బోహెనర్‌ను తొలగించేందుకు ప్రతినిధి మార్క్‌ మెడోస్‌ మోషన్‌ ప్రవేశపెట్టారు కానీ బోహెనర్‌ రాజీనామాతో అది జరగలేదు. రెండేళ్లపాటు పదవిలో ఉండాల్సిన మెక్‌కార్తి అంతకు ముందే పదవిని కోల్పోయారు. అమెరికాలో అతితక్కువ కాలం స్పీకర్‌గా పని చేసిన మూడో వ్యక్తిగా మెక్‌కార్తి నిలిచారు.

Updated On 4 Oct 2023 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story