క్రికెట్‌ను(Cricket) జెంటిల్మన్‌ గేమ్ అంటారు కానీ.. అది ఒకప్పటి మాట! ఇప్పుడా క్రికెట్ కూడా భ్రష్టుపట్టిపోయింది.

క్రికెట్‌ను(Cricket) జెంటిల్మన్‌ గేమ్ అంటారు కానీ.. అది ఒకప్పటి మాట! ఇప్పుడా క్రికెట్ కూడా భ్రష్టుపట్టిపోయింది. ఫీల్డ్‌లో తిట్టుకోవడం, కొట్టుకోవడం కామనయ్యింది. లేటెస్ట్‌గా ఓ మ్యాచ్‌లో ప్లేయర్లు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. పాపం అంపైర్లు ఆపాలని ప్రయత్నించినా వారు మాత్రం బ్యాట్‌లతో కొట్టుకున్నారు. వీరి కంటే వీధి రౌడీలు నయమనిపించింది. ఇది ఎక్కడ జరిగిందంటే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో(United of emarites).. ఎంసీసీ స్పోర్ట్స్‌ క్రికెట్‌ క్లమ్‌, ఎంసీసీ వీక్‌డేష్‌ బాష్‌(MCC Weekdays Bash XIX League ) XIX పేరుతో ఓ టోర్నమెంట్‌ నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మంగళవారం జరిగింది. ఏరోవిసా క్రికెట్‌, రబ్దాన్‌ క్రికెట్‌ క్లబ్‌లు కప్‌ కోసం పోటీపడ్డాయి. రబ్దాన్ క్రికెట్ క్లబ్ ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ వేసిన నాసిర్ అలీ బౌలింగ్‌లో చివ‌రి బంతికి కాషిఫ్ మ‌హ్మ‌ద్‌ ఎల్‌బిడబ్ల్యూగా అవుటయ్యాడు. అవుటయ్యాక తన మానాన తను వెళుతుంటే బౌలర్‌ వచ్చి రెచ్చగొట్టాడు. చాలా ఓవర్‌ చేశాడు. కాషిఫ్‌ దగ్గరకు వెళ్లిన అలీ అతడిని కావాలని రెచ్చగొట్టాడు. అప్పటికీ కాషిఫ్‌ ఎందుకులే గొడవ అన్నట్టుగా ఉన్నాడు. ఎప్పుడైతే అలీ అతడివైపు చేతి వేలు చూపిస్తూ గెట్‌ అవుట్‌ అని గట్టిగా అరిచాడో అప్పుడు కాషిఫ్‌కు కోపం వచ్చేసింది. అతడితో గొడవపెట్టుకున్నాడు.

ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల నుంచి ప్లేయర్లు కూడా కొట్లాటలో దూరారు. మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో గొడ‌వ మ‌రింత ఎక్కువయ్యింది. ఒక‌రొక‌రు పిడిగుద్దులు గుద్దుకున్నారు. బ్యాట్‌ల‌తో కూడా కొట్టుకున్నారు. మొదట్లో గొడవను ఆపడం అంపైర్ల వల్ల కూడా కాలేదు. ఎలాగోలా గొడవను సద్దుమణిగేలా చేశారు. ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. చూసినవాళ్లు ఇది క్రికెటో, రెజ్లింగో అర్థం కావడం లేదని కామెంట్‌ చేస్తున్నారు.




Updated On 27 Sep 2024 10:56 AM GMT
Eha Tv

Eha Tv

Next Story