మణిపూర్‌(Manipur)లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. గత ఎనిమిది నెలలుగా మణిపూర్‌ రగిలిపోతూనే ఉంది. తౌబల్‌ జిల్లా(Thoubal District)  లిలాంగ్‌ చింగ్‌జావో(Lilong Qingzhao) ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో నలుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మణిపూర్‌(Manipur)లో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. గత ఎనిమిది నెలలుగా మణిపూర్‌ రగిలిపోతూనే ఉంది. తౌబల్‌ జిల్లా(Thoubal District) లిలాంగ్‌ చింగ్‌జావో(Lilong Qingzhao) ప్రాంతంలో సోమవారం సాయంత్రం పోలీసు దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో నలుగురు చనిపోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత తౌబల్‌తో పాటు ఇంఫాల్‌ ఈస్ట్‌(Imphal East), ఇంఫాల్ వెస్ట్‌(Imphal West), కాక్‌చింగ్(Kakching), బిష్ణుపూర్‌(Bishnupur) జిల్లాలలో కర్ఫ్యూ విధించారు. దీంతో ఓ వర్గంవారు చెలరేగిపోయారు. నాలుగు కార్లకు నిప్పుపెట్టారు. అయితే మంటల్లో దగ్ధం అయిన కార్లు ఎవరివనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పుల ఘటనను ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌(CM Biren Singh) తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెప్పారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుందన్నారు. దోషులను పట్టుకుని, చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. గత ఏడాది మే 3వ తేదీన ట్రైబల్‌ సాలిడారిటీ మార్చ్‌(Tribal Solidarity March) అనంతరం జాతుల మధ్య వైరం మొదలయ్యింది. ఇప్పటికే మణిపూర్‌లో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌ జనాభాలో 53 శాతం మంది మొయితీలున్నారు. కొండ ప్రాంత జిల్లాల్లో నివసించే నాగాలు, కుకీలు కలిపి 40 శాతం వరకు ఉంటారు.

Updated On 2 Jan 2024 12:29 AM GMT
Ehatv

Ehatv

Next Story