ఓ భారతీయ యువకుడికి US B1/B2 వీసా ఇంటర్వ్యూలో 40 సెకన్లలోనే రిజెక్ట్‌ వచ్చింది.

ఓ భారతీయ యువకుడికి US B1/B2 వీసా ఇంటర్వ్యూలో 40 సెకన్లలోనే రిజెక్ట్‌ వచ్చింది. న్యూ ఢిల్లీలోని US ఎంబసీలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో, అతను మూడు ప్రశ్నలకు సత్యసంధంగా సమాధానం చెప్పాడు: ఫ్లోరిడాలో సెలవు కోసం వెళ్లాలనుకుంటున్నట్లు, గతంలో అంతర్జాతీయ ప్రయాణ అనుభవం లేనట్లు, ఫ్లోరిడాలో తన స్నేహితురాలు నివసిస్తున్నట్లు తెలిపాడు. అయితే, వీసా అధికారి భారతదేశానికి తిరిగి వస్తాడా లేదా అనే సందేహం వ్యక్తం చేసి, 214(b) తిరస్కరణ స్లిప్‌ను అందజేశారు. ఈ అనుభవాన్ని రెడ్డిట్‌లో పంచుకున్న అతను, తన తప్పు ఏమిటో, మళ్లీ దరఖాస్తు చేసే ముందు ఏం చేయాలో సలహాలు అడిగాడు. నెటిజన్లు అతని వీసా తిరస్కరణకు ప్రధాన కారణాలుగా అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేకపోవడం, USలో స్నేహితురాలు ఉన్నట్లు చెప్పడం కారణాలని విశ్లేషించారు.

తాను మళ్లీ భారత్‌కు తిరిగి వస్తానని నమ్మకం కలిగించాలని సలహా ఇచ్చారు. స్నేహితురాలి గురించి చెప్పడం నిజాయితిగా ఒప్పుకున్నప్పటికీ అక్కడే ఉండే అవకాశంగా అధికారులు భావిస్తారన్నారు. US వీసా విధానాలు తరచూ ప్రయాణాలు చేసేవారికి మాత్రమే అనుకూలంగా ఉంటాయని, తొలిసారి వెళ్లే ప్రయాణికులు అంత సానుకూలత ఉండదని నెటిజన్లు సలహాఇస్తున్నారు. మళ్లీ దరఖాస్తు చేసే ముందు, యువకుడు దేశంలోని ఆధారాలను చూపాలని తన ఉద్యోగ లేఖలు, ఆస్తి పత్రాలు చూపాలని సలహా ఇచ్చారు.ఇతర దేశాలకు వెళ్లి వచ్చినట్లు ట్రావెలింగ్‌ హిస్టరీ ఉండేలా చూసుకోవాలన్నారు. వీసా ఇంటర్వ్యూలో అత్యంత అవసరమైన సమాచారాన్ని మాత్రమే చెప్పాలని, ముఖ్యంగా USలో వ్యక్తిగత సంబంధాల గురించి అతిగా చెప్పకపోవడం మంచిదని సూచించారు.

ehatv

ehatv

Next Story