కొలిన్ డేవిస్ మెక్‌కార్తీ (Colin Davis McCarthy) అనే వ్యక్తి కారులో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆల్రెడీ తాను $100 బిల్లుల స్టాక్‌ల ద్వారా విత్ డ్రా చేసిన మొత్తం సొమ్ము $200,000 తన కారు కిటికీలోంచి బయటకు విసిరేసాడు. ఆ అమౌంట్(amount) మొత్తం ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 1 కోటి 60 లక్షల రూపాయలు.

రోడ్డు మీద ఒక్క కరెన్సీ నోటు కనిపించిన..లేదా ఏదయిన వస్తువు కనిపించినా ..వాటి కోసం జనం తీసుకోవడానికి పరుగులు పెడతారు. అలాంటిది దాదాపుగా రెండు కోట్ల రూపాయల నోట్లు .. అలా రోడ్డుమీద కట్టలు కట్టలు కనిపిస్తే ఇంకా జనం ఏ రేంజ్ లో పరుగులు పెడతారో ఊహించుకోండి.. మరి ఇలాంటి ఘటనే రీసెంట్ గా అమెరికాలో జరిగింది.

యూఎస్ ఒరెగాన్‌లో (Oregon) రద్దీగా ఉండే హైవే. కొలిన్ డేవిస్ మెక్‌కార్తీ (Colin Davis McCarthy) అనే వ్యక్తి కారులో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆల్రెడీ తాను $100 బిల్లుల స్టాక్‌ల ద్వారా విత్ డ్రా చేసిన మొత్తం సొమ్ము $200,000 తన కారు కిటికీలోంచి బయటకు విసిరేసాడు. ఆ అమౌంట్(amount) మొత్తం ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 1 కోటి 60 లక్షల రూపాయలు. ఇదేంటి? ఇది నిజమైన కరెన్సీ నోట్ల లేదా ఈ మనిషికి పిచ్చి ఏమైనా పట్టిందా అనుకుంటున్నారు కదా. కానీ ఇది నిజమేనండి.

ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ..అతనికి ఫ్యామిలీ మెంబర్స్‌తో జాయింట్ అకౌంట్ (joint account)ఉందట. అయితే ఆ అకౌంట్ లోంచి వారు డబ్బు మొత్తం దోచేస్తుండటం కొలీన్‌కి కోపం(angry) తెప్పించిందట. అందుకే ఆ డబ్బుని విత్ డ్రా చేసి జనానికి బహుమతిగా ఇవ్వాలని అనుకున్నాడట. అందుకే అలా రోడ్ పై విసిరేసాడని తెలుస్తోంది. ఇక నడిరోడ్డుపై నోట్ల కట్టలు కనిపించే సరికి ... అటువైపుగా వెళ్తున్న వాహనదారులంతా కారులు ఆపి డబ్బుల వేటలో పడ్డారు.

ఇక కొలిన్(Colin) విచిత్రమైన స్టంట్ చేయడం కోసం తమ జాయింట్ అకౌంట్ లోంచి డబ్బులు తీసివేసాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. డబ్బును తీసుకున్నవారు దయచేసి తిరిగి ఇవ్వాల్సిందిగా రిక్విస్టె చేస్తోంది. అయితే ఇప్పటి వరకూ పోలీసులు కొలిన్‌ను అయితే అరెస్ట్ చేయలేదు. చేతిలోంచి పడిపోయిన సెల్ ఫోన్, డబ్బులు ఎవరైనా తిరిగి ఇచ్చేసిన సంఘటనలు మనం అరుదుగా చూస్తాం. అంత డబ్బు కళ్ల చూసిన వారు తిరిగి ఇవ్వడం అంటే అయ్యే పని కాదు. కానీ కొలిన్‌పై పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా అనేది చూడాలి.

Updated On 17 April 2023 4:56 AM GMT
madhuri p

madhuri p

Next Story