అది చాలా ఖరీదైన వస్తువే. సుమారు 50 కోట్ల రూపాయలు ఉంటుంది. కాకపోతే ముట్టుకోవడానికే మనం మొహం అదోలా పెడతాం. అదేమిటంటే బంగారంతో చేసిన టాయిలెట్‌(Golden camode). ఇంగ్లాండ్‌లోని(England) చారిత్రాత్మక ప్రదేశమైన బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్‌లో(Blenheim Palace) ఉందీ గోల్డెన్‌ టాయిలెట్‌(Golden toilet). ఒకప్పుడు బ్రిటన్‌కు చెందిన గొప్ప నాయకుడు విన్‌స్టన్‌ చర్చిల్(Winston Churchill) అందులో ఉండేవారు. ప్రస్తుతం దాన్ని మ్యూజియంగా మార్చారు.

అది చాలా ఖరీదైన వస్తువే. సుమారు 50 కోట్ల రూపాయలు ఉంటుంది. కాకపోతే ముట్టుకోవడానికే మనం మొహం అదోలా పెడతాం. అదేమిటంటే బంగారంతో చేసిన టాయిలెట్‌(Golden camode). ఇంగ్లాండ్‌లోని(England) చారిత్రాత్మక ప్రదేశమైన బ్లెన్‌హీమ్‌ ప్యాలెస్‌లో(Blenheim Palace) ఉందీ గోల్డెన్‌ టాయిలెట్‌(Golden toilet). ఒకప్పుడు బ్రిటన్‌కు చెందిన గొప్ప నాయకుడు విన్‌స్టన్‌ చర్చిల్(Winston Churchill) అందులో ఉండేవారు. ప్రస్తుతం దాన్ని మ్యూజియంగా మార్చారు. అమూల్యమైన వస్తువులు అందులో ఉంటాయి. 2019 డిసెంబర్‌లో ఈ ప్యాలెస్‌లో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ జరిగింది. ఆ సమయంలో వెల్లింగ్‌బరోకు చెందిన 39 ఏళ్ల జేమ్స్‌ షీన్‌ అలియాస్‌ జిమ్మీ ఈ బంగారం లాయిలెట్‌ను ఎత్తుకెళ్లాడు. తాజాగా అతను దోషిగా తేలాడు. ఇటీవల ఆక్స్‌ఫర్డ్‌ క్రౌన్‌ కోర్టు విచారణలో తానే ఆ దొంగతనాన్ని చేసినట్టు అంగీకరించాడు జిమ్మీ. ఈ టాయిలెట్‌ను ప్రఖ్యాత ఇటాలియన్‌ కళాకారుడు మౌరిజియో కాటెలాన్‌ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశాడు. జమ్మీ షీన్‌ ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విలువైన వస్తువులను చోరీ చేశాడు. నేషనల్‌ హార్స్‌ రేసింగ్‌ మ్యూజియంలో విలువైన ట్రాక్టర్లు, ట్రోఫీలను దొంగతనం చేశాడు. ప్రస్తుతం 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 2019లో షాంఘైలో జరిగిన చైనా ఇంటర్నేషనల్‌ ఇంపోర్ట్‌ ఎక్స్‌పోలో హాంకాంగ్‌కు చెందిన ఓ కళాకారుడు బంగారంతో టాయిలెట్‌ సీటును తయారుచేశాడు. దాంతో 40,815 చిన్న చిన్న వజ్రాలను అమర్చాడు. బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌తో తయారుచేసిన ఈ టాయిలెట్‌ను కూడా జేమ్స్‌ షీన్‌ ఎత్తుకెళ్లాడు.

Updated On 4 April 2024 3:26 AM GMT
Ehatv

Ehatv

Next Story