Samsung Galaxy Buds:శాంసంగ్ ఇయర్ బడ్స్ పేలి వినికిడి దొబ్బింది
గతంలో స్మార్ట్‌ఫోన్‌లు పేలిన సందర్భాలు చాలా చూశాం.
గతంలో స్మార్ట్‌ఫోన్‌లు పేలిన సందర్భాలు చాలా చూశాం. అయితే ఇయర్ బడ్స్(Ear Buds) కూడా పేలడం బహుశా ఇదే తొలిసారి ఉండొచ్చు. ర
టర్కీ(Turki)లో బయాజిత్ అనే వ్యక్తి.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. తాను శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ బడ్స్ ఎఫ్.ఈ.(galaxy buds fe)ని వాడుతున్నానని.. అవి చెవులో పెట్టుకోగా.. ఓ ఇయర్ బడ్ పేలిందని.. చెవి వినికిడి పూర్తిగా పోయిందని కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. అయితే అతని గర్ల్‌ఫ్రెండ్ అతని కోసం అప్పు చేసి ఈ ఇయర్‌బడ్స్ కొని గిఫ్ట్‌గా ఇద్దామనుకుంది. ఇయర్స్ బడ్స్ పనితీరును చెక్ చేస్తుండగా ఆమె చెవిలో ఇయర్‌బడ్స్ పేలాయి. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఆమె శాశ్వతంగా వినికిడి కోల్పోయింది. సంఘటన జరిగిన వెంటనే బయాజిత్ శాంసంగ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. మొదట సామ్‌సంగ్ దురదృష్టకర సంఘటనకు క్షమాపణలు చెప్పింది, కానీ ఇయర్ బడ్స్ పేలలేదని కంపెనీ ప్రకటించుకుంది. ఇంకో ఇయర్ బడ్ జోడిని ఫ్రీగా అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. కానీ నష్టపరిహారం ఇస్తామని ప్రకటించకపోవడంతో వినియోగదారుడు, బాధితురాలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు.