New Jersey : ఎయిర్‌హోస్టెస్‌తో సెక్స్ కావాలని విమానంలో చుక్కలు చూపించాడు
ఓ విమానం గగనతలంలో ప్రయాణిస్తుంది. అందులో ఓ ప్రయాణికుడి 'కోరిక' వింటే మీరు ఆశ్చర్యపోతారు.
ఓ విమానం గగనతలంలో ప్రయాణిస్తుంది. అందులో ఓ ప్రయాణికుడి 'కోరిక' వింటే మీరు ఆశ్చర్యపోతారు. విమనంలో ప్రయాణికులకు సేవలు చేసే ఎయిర్‌హోస్టెస్‌పై(Airhostess) ఓ ప్రయాణికుడు మనసుపడ్డాడు. అంతేకాదు ఆ ఎయిర్‌హోస్టెస్ తనతో శృంగారం(Romance) చేయాలని పట్టుబట్టాడు. లేదంటే దూకేస్తానని ఎమర్జెన్సీ డోర్ తెరవబోయాడు. విమన సిబ్బందికి, తోటి ప్రయాణికులకు చుక్కలు చూపించాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికా(america) మీడియా వర్గాల ప్రకారం న్యూజెర్సీ(New Jersy) డెలాన్క్‌లో ఉంటున్న నికోలాస్ గాప్కో (26) సియాటిల్ నుంచి డల్లాస్ వెళ్లేందుకు జులై 18న అమెరికన్
ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 2101 విమానం ఎక్కాడు. విమానం టేకాఫ్ అయింది. అయితే నికోలాస్ గాప్కో(Nicolas Gapco) అకస్మాత్తుగా ఓ ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. తన కోరిక తీర్చాలని ఆమెను కోరగా వెంటనే సిబ్బందికి ఫిర్యాదు చేసింది. విమన సిబ్బందితో అతను గొడవ కూడా పడ్డాడు. వారిపై దాడి కూడా చేసేందుకు ప్రయత్నించడమే కాకుండా వింతగా ప్రవర్తించాడు. తను నగ్నంగా మారి తనతో శృంగారం చేయాలని ఎయిర్‌హోస్టెస్ కావాలి అంటూ గట్టిగట్టిగా అరిచాడు. తోటి ప్రయాణికులు కూడా వారించేందుకు ప్రయత్నించగా ఎమర్జెన్సీ డోర్ దగ్గరికి వెళ్లి దాన్ని తీస్తానని, అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించాడు. ఇక్కడే పైలట్ సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఎయిర్ హోస్టెస్‌ను తన దగ్గరికి పంపేందుకు నేను సహకరిస్తానని నచ్చజెప్పి టాయిలెట్ వద్దకు తీసుకెళ్లాడు. వెంటనే తోటి ప్రయాణికులతో కలిపి అతడి కాళ్లు, చేతులు కట్టేసి బాత్‌రూంలో పడేశారు. ఆ తర్వాత పైలట్ సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీగా విమానాన్ని ల్యాండ్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన వెళ్లి పోలీసులు నికోలాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకున్నందునే నికొలాస్ విచిత్రంగా ప్రవర్తించాడని విచారణలో తేలింది. నికోలాస్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపర్చారు పోలీసులు.