చదరంగంలో(Chess) కాకలు తీరిన ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు(Magnus Carlson) ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. నార్వేకు(Norway) చెందిన ఈయన ప్రపంచంలోనే గొప్ప చెస్‌ క్రీడాకారుడు. అయిదుసార్లు ప్రపంచ చెస్‌ చాంపియన్‌, అయిదు సార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌, ఏడుసార్లు ప్రపంచ బ్లిడ్జ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.

చదరంగంలో(Chess) కాకలు తీరిన ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు(Magnus Carlson) ఇంట్రడక్షన్‌ అవసరం లేదు. నార్వేకు(Norway) చెందిన ఈయన ప్రపంచంలోనే గొప్ప చెస్‌ క్రీడాకారుడు. అయిదుసార్లు ప్రపంచ చెస్‌ చాంపియన్‌, అయిదు సార్లు ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌, ఏడుసార్లు ప్రపంచ బ్లిడ్జ్‌ చెస్‌ చాంపియన్‌గా నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌ను 2013లో ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆ మరుసటి సంవత్సరం ఆనంద్‌పై తన టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆయన ఇటీవల ఓ కొత్త సవాల్‌ను స్వీకరించాడు. లై డిటెక్టర్‌ టెస్ట్‌లో(Lie Ditector Test) అంటే సత్యశోధన పరీక్షలో పాల్గొన్నాడు. చెస్‌ వ్యాఖ్యత, గ్రాండ్‌మాస్టర్‌ డేవిడ్‌ హోవెల్‌ అడిగిన అనేక ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. కార్ల్‌సన్‌ చెబుతున్న జవాబులు నిజమో కాదో పాలీగ్రాఫ్‌ నిపుణుడు ఒర్జాన్‌ హెస్‌జెదాల్‌ చెక్‌ చేశారు. ఆయన చెబుతున్నవన్నీ నిజాలేనని చెప్పాడు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడనందుకు చింతిస్తున్నావా అని అడిగిన ప్రశ్నకు కార్లసన్‌ అలాంటిదేమీ లేదని జవాబిచ్చాడు. కెరీర్‌లో అత్యంత ఇబ్బందికర సందర్భం ఏదైనా ఉందా అని అడిగిన ప్రశ్నకు ఓసారి ప్యాంట్లో మూత్రం పోసుకున్నానని, బోర్డుపై నీళ్లు చల్లానని, పావులను పడేశానని చెప్పాడు కార్ల్‌సన్‌. ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ ఈసారి టైటిల్ను నిలబెట్టుకుంటాడని భావిస్తున్నావా అని అడిగిన ప్రశ్నకు నో అని జవాబిచ్చాడు. అయితే ఇది క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో మన గుకేశ్‌ దొమ్మరాజు విజయం సాధించడానికి ముందు తీసిన వీడియో!

Updated On 25 April 2024 4:28 AM GMT
Ehatv

Ehatv

Next Story