కంపెనీ ప్రమోషన్ల విషయంలో సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాధురి దీక్షిత్‌లా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.

కంపెనీ ప్రమోషన్ల విషయంలో సెలబ్రెటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాధురి దీక్షిత్‌(Madhuri Dixit)లా ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మ్యాటర్‌లోకి వద్దాం. పాకిస్తాన్‌(Pakistan) సంతతికి చెందిన అమెరకన్‌ వ్యాపారవేత్త రెహన్‌ సిద్ధిఖీ(Rehan Siddiqui) వచ్చే ఆగస్టు మాసంలో తన కంపెనీల ప్రమోషన్‌ కోసం టెక్సాస్‌(Texas)లో భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్న మాధురి దీక్షిత్‌ కూడా ఆ ఈవెంట్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. అయితే రెహన్‌ సిద్ధిఖీకి పాకిస్తాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయి. ఈ విషయం తెలిసే భారత ప్రభుత్వం ఆయన నిర్వహించే సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. పాపం ఈ విషయం మాధురి దీక్షిత్‌కు తెలియదు కాబోలు.. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనంటున్నారు నెటిజన్లు. సోషల్‌ మీడియా(Social Media)లో మాధురిపై విమర్శలు చేస్తున్నారు. టెక్సాస్‌ ఈవెంట్‌కు సంబంధించిన ఓ పోస్టర్‌ను పొలిటికల్‌ కాలమిస్ట్‌ సునందా వశిష్ట్‌(Sunanda Vashisht) తన సోషల్‌మీడియాలో పోస్టు చేసింది. ఆ పోస్టర్‌లో రెహన్‌ సిద్ధికీ, మాధురిదీక్షిత్‌ ఫొటోలున్నాయి. పోస్టర్‌ను షేర్‌ చేసిన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెహన్‌ సిద్ధిఖీ బ్యాక్‌గ్రౌండ్‌ ఏమిటో తెలుసుకోకుండా మాధురిదీక్షిత్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారని, వెంటనే ఆమె టెక్సాస్‌ ఈవెంట్‌ నుంచి వైదొలగాలని నెటిజన్లు అంటున్నారు. ఈ వివాదంపై మాధురి దీక్షిత్‌ ఇంకా రియాక్టవ్వలేదు.

Eha Tv

Eha Tv

Next Story