చాన్నాళ్ల కిందట పోయిందనుకున్న వాలెట్‌(Wallet) 65 ఏళ్ల తర్వాత యజమాని కుటుంబ సభ్యులకు చేరింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! అట్లాంటాలో(Atlanta) ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వాలెట్‌ ఎప్పుడు ఎలా పోయింది? ఎవరు ఆ వాలెట్‌ను తిరిగి యజమాని కుటుంబసభ్యులకు ఇచ్చారు? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ అట్లాంటాలోని పురాతన ఫ్లాజా థియేటర్‌లో స్టార్టయ్యింది. ఆ థియెటర్‌కు(Theatre) మరమత్తులు చేస్తుండగా థియేటర్‌ వెనుకవైపున ఉన్న బాత్‌రూమ్‌ గోడకూలిపోయింది. దాంతో వాలెట్‌ బయటపడింది. అందులో కొన్ని మాగ్నటిక్‌ స్ట్రిప్‌ లేని క్రెడిట్‌లు, సినిమా టికెట్‌(Cinema tickets), ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని నలుపు-తెలుపు ఫోటోలు(Photos) ఉన్నాయి.

చాన్నాళ్ల కిందట పోయిందనుకున్న వాలెట్‌(Wallet) 65 ఏళ్ల తర్వాత యజమాని కుటుంబ సభ్యులకు చేరింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! అట్లాంటాలో(Atlanta) ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇంతకీ ఆ వాలెట్‌ ఎప్పుడు ఎలా పోయింది? ఎవరు ఆ వాలెట్‌ను తిరిగి యజమాని కుటుంబసభ్యులకు ఇచ్చారు? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ అట్లాంటాలోని పురాతన ఫ్లాజా థియేటర్‌లో స్టార్టయ్యింది. ఆ థియెటర్‌కు(Theatre) మరమత్తులు చేస్తుండగా థియేటర్‌ వెనుకవైపున ఉన్న బాత్‌రూమ్‌ గోడకూలిపోయింది. దాంతో వాలెట్‌ బయటపడింది. అందులో కొన్ని మాగ్నటిక్‌ స్ట్రిప్‌ లేని క్రెడిట్‌లు, సినిమా టికెట్‌(Cinema tickets), ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని నలుపు-తెలుపు ఫోటోలు(Photos) ఉన్నాయి. ఆ థియేటర్‌ యజమాని క్రిస్‌ ఎస్కోబార్‌(Escobar) ఆ వాలెట్‌ను ఎలాగైనా సరే దాని యజమానికో లేదా ఆయన కుటుంబసభ్యులకో అందిద్దామనుకున్నాడు. 1959లో చేవ్రోలెట్‌ సినిమా చూసేందుకు వచ్చి ఆ వాలెట్‌ను పోగొట్టుకున్నట్టుగా అందులో ఉన్న టికెట్‌ను బట్టి తెలిసింది. ఆ కుటుంబం ముందు ఈ పరిసరాలలోనే ఉంటే ఉండొచ్చు కానీ ఇప్పుడూ అక్కడే ఉంటుందన్న గ్యారంటీ ఏమీ లేదు. చాన్నళ్లయింది కాబట్టి ట్రేస్‌ చేయడం కష్టమే! కానీ వాలెట్‌లో ఉన్న లైసెన్స్‌ కార్డుల(License Card) ఆధారంగా ఆ వ్యాలెట్‌ ఓ మహిళలది కనిపెట్టాడు క్రిస్‌ ఎస్కోబార్‌. ఆమె పేరు ఫ్లాయ్‌ కల్‌బ్రేత్‌గా(Culbreth) గుర్తించాడు. అయితే అరవై డెబ్బయ్‌ ఏళ్ల కిందట మహిళలు తమ భర్తల పేరుతో పిలిచేవారు. దాంతో ఆమె అడ్రస్‌ కనిపెట్టడం చాలా కష్టంగా మారింది. దాంతో క్రిస్‌ తన భార్య సాయం తీసుకున్నాడు. ఆమె ఇంటర్నెట్‌లో వెతకగా కల్‌బ్రెత్ చనిపోయినట్టు తెలిసింది. కల్‌బ్రెత్‌ పేరు మీద కల్‌బ్రెత్‌ కప్‌ అనే గోల్ఫ్‌ టోర్నమెంట్‌ ఉందనే విషయాన్ని వెబ్‌సైట్‌(website) ద్వారా తెలుసుకుంటారు. ఓ ఛారిటీ సంస్థ కోసం ఈ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్టు తెలుసుకుంటారు. ఆ విధంగా కల్‌బ్రెత్‌ కూతురు థియా చాంబర్‌లైన్‌ను(Thea Chamberlain) కనుగొంటారు. ఆమెకు ఆ వాలెట్‌ను అందిస్తాడు క్రిస్‌. ఆ పర్సును అందుకున్న చాంబర్‌లైన్‌ ఉద్విగ్నతకు లోనవుతుంది. తన తల్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతుంది. తన తల్లి చాలా అందంగా ఉండేదని చెబుతుంది. ఆమె వ్యాలెట్‌లో భీమా కార్డులు, డాక్టర్‌ అపాయింట్‌మెంట్‌ నోట్‌లు కనుగొంటుంది. ట్విస్ట్‌ ఏంటంటే థియా చాంబర్‌లైన్‌కు ఇప్పుడు 71 ఏళ్లు. తన తల్లి ఈ వాలెట్‌ను పోగొట్టుకున్నప్పుడు ఆరేళ్లు. వాలెట్‌ అందుకున్న కల్‌బ్రెత్‌ ఎలాంటి అనుభూతికి లోనయ్యిందో, ఇస్తున్నప్పుడు క్రిస్‌ కూడా అలాంటి అనుభూతికే లోనయ్యాడు.

Updated On 28 Dec 2023 7:15 AM GMT
Ehatv

Ehatv

Next Story