World's First Sperm Race : తొలిసారి స్పెర్మ్ రేసింగ్..! అసలు దీని ఉద్దేశం ఏంటి..!
ఈనెల 25న లాస్ ఏంజిల్స్‌లో స్పెర్మ్ రేసింగ్ జరగబోతుంది.

ఈనెల 25న లాస్ ఏంజిల్స్(Los Angeles)లో స్పెర్మ్ రేసింగ్(sperm race) జరగబోతుంది. ఇది పురుషుల సంతానోత్పత్తి సమస్యలపై అవగాహన పెంచడానికి ఒక వినూత్న ప్రయత్నం. పురుషుల సంతానోత్పత్తి సమస్యలు గురించి అవగాహన పెంచడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత 50 ఏళ్లలో స్పెర్మ్ కౌంట్ 50% కంటే ఎక్కువ తగ్గిందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, లైఫ్‌స్టైల్ వంటి ఫాక్టర్స్ దీనికి కారణం. ఈ ఈవెంట్ ద్వారా, ఈ సమస్యలను ఫన్, ఎంగేజింగ్ విధానంలో హైలైట్ చేస్తారు. ప్రజల్లో సంతానోత్పత్తి ఆరోగ్యం గురించి ఎడ్యుకేట్ చేయడం లక్ష్యం.పురుషుల సంతానోత్పత్తి గురించి అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. రెండు స్పెర్మ్ శాంపిల్స్ 20 సెం.మీ మైక్రోస్కోపిక్ రేస్‌ట్రాక్‌లో పోటీపడతాయి. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థను అనుకరిస్తుంది, హై-రిజల్యూషన్ కెమెరాలతో లైవ్‌స్ట్రీమ్ చేస్తారు.
